- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BJP: లైన్ దాటితే రాజాసింగ్ కు పట్టిన గతే మీకు.. మాధవిలతపై బీజేపీ అధిష్టానం సీరియస్!
తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ ఎపిసోడ్ రచ్చ ముగియడం లేదు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ బీజేపీలో రాజాసింగ్ ఎపిసోడ్ ఇంకా చల్లారడం లేదు. అధిష్టానం రాజాసింగ్ ను సస్పెండ్ చేసినా ఆయన విషయంలో చర్చ ఆ పార్టీ వర్గాల్లో ఇంకా జోరుగా జరుగుతూనే ఉంది. ఈ క్రమంలో రాజాసింగ్ (Rajasingh) వ్యవహారంపై బీజేపీ నేత కొంపెల్లి మాధవిలత (Madhavilatha) ఇటీవల చేసిన వ్యాఖ్యలు కాంట్రవర్సీగా మారాయి. మాధవీలత తీరుతో కమలం పార్టీలో మరోసారి పాత, కొత్త నేతల చర్చ తెరమీదకు వస్తోంది. దీంతో ఆమెపై సోషల్ మీడియాలో బీజేపీ మద్దతుదారులు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. రాజాసింగ్ తో మీకు పోలిక ఏంటి? పార్టీకి, హిందుత్వకు ఆయన చేసిన సేవకు మీరు చేసిన సేవకు తేడాను ఎత్తిచూపుతూ విమర్శలు చేస్తున్నారు. దీంతో రాజాసింగ్ వర్సెస్ మాధవిలత వ్యవహారం టీ బీజేపీలో హాట్ హాట్ గా మారింది.
మాధవీలతపై అధిష్టానం సీరియస్!:
మాధవిలత తీరుతో పార్టీకి డ్యామేజ్ తప్పదని గ్రహించిన తెలంగాణ బీజేపీ (Telangana BJP) నేతలు ఆమె వైఖరిని హైకమాండ్ కు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. రాజాసింగ్ రాజీనామాపై ఆమె అవసర వ్యాఖ్యలు చేస్తోందని పార్టీ పెద్దల దృష్టికి తీసుకువెళ్లారట. దీంతో మాధవిలతపై పార్టీ అధిష్టానం సీరియస్ అయిందని పార్టీ లైన్ దాటితే రాజాసింగ్ కు పట్టిన గతే పడుతుందని హెచ్చరించినట్లు ప్రచారం జరుగుతోంది. రాజాసింగ్ ఎపిసోడ్ పై ఎవరూ మాట్లాడొద్దని ఆయన రాజీనామా అంశంపై అనవసర వ్యాఖ్యలు చేయవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. జాతీయ పార్టీ నిర్ణయాన్ని పట్టించుకోకుండా మాట్లాడొద్దని వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
సీటు కోసమేనా ఈ హడావుడి?:
గత లోక్ సభ ఎన్నికల్లో హైదరాబాద్ సెగ్మెంట్ నుంచి బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన మాధవిలత అసదుద్దీన్ ఒవైసీ చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే త్వరలో జూబ్లీహిల్స్ బై పోల్ జరగాల్సి ఉంది. గోషామహల్ స్థానంలో రాజాసింగ్ రాజీనామా ఖాయమే అయితే అక్కడ కూడా ఉప ఎన్నిక వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో త్వరలో జరగబోయే ఉప ఎన్నికలను దృష్టిలో ఉంచుకునే మాధవిలత ఈ తరహా వ్యాఖ్యలతో సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్ గా నిలిచే ప్రయత్నం చేస్తున్నారా అనే చర్చ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. గతంలోనూ ఆమె పెద్దఎత్తున సోషల్ మీడియాను ఉపయోగించుకుని మిగతా సీనియర్ నేతల కంటే జాతీయ నేతల వద్ద ఆమె తనకు తాను హైప్ క్రియేట్ చేసుకుందనే విమర్శలు ఉన్నాయి. సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి తర్వాత సైలెంట్ అయిపోయిన మాధవిలత ఇప్పుడు రాజాసింగ్ పై నోరు జారితే అది పార్టీకి డ్యామేజ్ తప్పదనే చర్చ కలమం పార్టీ నేతల్లోనే వ్యక్తం అవుతోందట. ఇక మాధవిలత పేరు వచ్చిన ప్రతి సారి ఆమె వ్యాపార వ్యవహారాలు సోషల్ మీడియాలో ప్రస్తావనకు వస్తుండటం బీజేపీకి మైనస్ అనే చర్చ జరుగుతోంది. గతంలో ఓ మసీదు వద్ద బాణం వేసినట్లుగా సంజ్ఞ చేసి కాంట్రవర్సీగా మారిన మాధవిలత ఇప్పుడు మసీదులను సందర్శించడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆమె తీరుతో పార్టీకి ప్రయోజనం కంటే ప్రమాదమే ఎక్కువ అనే టాక్ వినిపిస్తోంది. మరి అధిష్టానం మందలించిందన్న ప్రచారం వేళ మాధవిల వెనక్కి తగ్గుతారా లేక అదో జోరు కొనసాగిస్తారా చూడాలి మరి.






