- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: డిప్యూటీ CM భట్టికి గుత్తా సుఖేందర్ రెడ్డి ఫోన్
తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని కలిసిన కాంట్రాక్టర్లు

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి(Gutta Sukhender Reddy)ని మంగళవారం మండలిలోని ఆయన ఆఫీస్‌లో మన ఊరు- మన బడి కాంట్రాక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. పెండింగ్‌లో ఉన్న తమ బిల్లులను ప్రభుత్వం త్వరగా విడుదల చేసేందుకు సహాయం చేయాలని వారు గుత్తా సుఖేందర్ రెడ్డికి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా శాసన మండలి చైర్మన్ వారి సమస్యలు తెలుసుకుని, సానుకూలంగా స్పందించారు. వెంటనే రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార్కతో ఫోన్ ద్వారా మాట్లాడారు. రాష్ట్ర వ్యాప్తంగా మన ఊరు- మన బడి(Mana Ooru - Mana Badi) కాంట్రాక్టర్ల పెండింగ్ బిల్లులను వెంటనే విడుదల చేయాలని కోరారు. అలాగే లేఖను రాసి కూడా డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు పంపించారు. మన ఊరు - మన బడి పనులు చేసిన వారు చిన్న కాంట్రాక్టర్లు అని, వారి బిల్లులు రాకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నరని తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వివరించారు.






