Secretariat: బిల్లులు క్లియర్ కావాలంటే 20% కమీషన్! సచివాలయంలో కాంట్రాక్టర్ల ఆందోళన

by Ramesh Naini |   (  Updated:2025-03-07 12:30:01  IST  )

తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో కాంట్రాక్టర్లు మెరుపు ధర్నా చేపట్టారు. బిల్లులు రావడం లేదంటూ ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి చాంబర్ ముందు ఆందోళనకు దిగారు.

Secretariat: బిల్లులు క్లియర్ కావాలంటే 20% కమీషన్! సచివాలయంలో కాంట్రాక్టర్ల ఆందోళన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సచివాలయం (Secretariat)లో శుక్రవారం కాంట్రాక్టర్లు మెరుపు ధర్నా చేపట్టారు. బిల్లులు రావడం లేదంటూ ఆర్థిక శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క (Deputy CM Bhatti Vikramarka) చాంబర్ ముందు ఆందోళనకు దిగారు. వివిధ జిల్లాల నుంచి వచ్చిన పెద్ద ఎత్తున్న కాంట్రాక్టర్లు.. ఆర్థిక శాఖ మంత్రి భట్టి కలిసేందుకు వచ్చారు. అయితే ఎస్పీఎఫ్ సెక్యూరిటీ సిబ్బంది ఆపడంతో కాంట్రాక్టర్లు ఆందోళనకు దిగారు. దీంతో కాంట్రాక్టర్లు నిరసన విరమించేలా పోలీసులు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. గత మూడు సంవత్సరాలకు పైగా పెండింగ్‌లోనే బిల్లులు ఉన్నట్లు కొంత మంది కాంట్రాక్టర్లు చెబుతున్నారు. ఈ పెండింగ్ బిల్లులు క్లియర్ కావాలంటే కనీసం 20 శాతం కమీషన్ (20 percent commission) అధికారులు అడుగుతున్నట్లు తీవ్ర ఆరోపణలు చేశారు. అయితే, కాంట్రాక్టర్ల ఆందోళనతో సెక్రటేరియట్ నుంచి భట్టి విక్రమార్క వెళ్లిపోయినట్లు టాక్ నడుస్తోంది.

Next Story