శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద

by Ajay Maddhiboyina |

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలో 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2.98 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 2.82 లక్షల క్యూసెక్కులుగా ఉంది.

శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు కొనసాగుతున్న వరద
X

దిశ, వెబ్ డెస్క్: శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులకు వరద కొనసాగుతోంది. శ్రీశైలం జలాశయంలో 8 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 2.98 లక్షల క్యూసెక్కులు ఉండగా ఔట్ ఫ్లో 2.82 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా ప్రస్తుత నీటిమట్టం 882 అడుగులుగా ఉంది. మరోవైపు నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు వరద ఉధ్రుతి పెరిగింది. 26 క్రస్ట్ గేట్ల ద్వారా దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్‌ఫ్లో 3.41 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఔట్ ఫ్లో 3.05 లక్షల క్యూసెక్కులుగా ఉంది. పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగుల వద్ద ఉంది. కాగా నాగార్జున సాగ‌ర్ ప్ర‌స్తుత నీటిమ‌ట్టం 586.70 అడుగులుగా ఉంది.

Next Story