- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వికారాబాద్‌లో మహిళా సంఘాల భవనాల నిర్మాణం జోరు
తెలంగాణ ప్రభుత్వం మహిళామణులను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో వారికి అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తూ జీరో వడ్డీకి రుణాలు అందిస్తూ వారికి వ్యాపారాలు చేసుకునేలా వెసులుబాటు కలిపిస్తూ అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుంది.

దిశ, వికారాబాద్ ప్రతినిధి : తెలంగాణ ప్రభుత్వం మహిళామణులను కోటీశ్వరులను చేయాలనే లక్ష్యంతో వారికి అన్ని విధాలా సౌకర్యాలు కల్పిస్తూ జీరో వడ్డీకి రుణాలు అందిస్తూ వారికి వ్యాపారాలు చేసుకునేలా వెసులుబాటు కలిపిస్తూ అభివృద్ధికి బాటలు వేయడం జరుగుతుంది. అందులో భాగంగా మహిళా సంఘాలకు ప్రభుత్వం భవనాలు మంజూరు చేసి వారికి సౌకర్యాలు కల్పిస్తుంది. వికారాబాద్ జిల్లాలో 22.1 కోట్ల రూపాయలతో 221 మహిళా సంఘాల భవనాల నిర్మాణాలకు మంజూరులు ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా 221 భవనాలలో భాగంగా నాలుగు భవనాలు ఇప్పటికీ పూర్తికాగా 186 భవనాలు వివిధ దశల్లో నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఇంకా 31 భవనాలకు పనులు ప్రారంభించాల్సి ఉంది. ఇప్పటివరకు 5.41 కోట్ల రూపాయలు ఖర్చు చేసి భవనాల నిర్మాణ పనులను కొనసాగిస్తున్నారు. వికారాబాద్ జిల్లాలో మహిళా సంఘాల అభివృద్ధికి ప్రభుత్వం నిధులు మంజూరు చేసి వారికి మహిళా సంఘాల ద్వారా వివిధ వ్యాపారాలు చేసుకునేలా వెసులుబాటు కల్పించింది. అందులో భాగంగా మహిళా క్యాంటీన్లు ఏర్పాటు చేసి మహిళలు స్వయం ప్రతిపత్తిగా అభివృద్ధి దిశగా పయనిస్తున్నారు.
అదేవిధంగా మహిళా సంఘాల ద్వారా ఇప్పటికే జిల్లాలో ఏడు బస్సులను కొనుగోలు చేసి ఆర్టీసీ ద్వారా మహిళా సంఘాల ద్వారా సేవలందిస్తున్నారు. అలా వచ్చిన డబ్బులు మహిళా సంఘాల ఖాతాలో జమ అవుతుండడంతో మహిళలు అభివృద్ధి దిశగా పయనిస్తున్నారు. మహిళలను ప్రోత్సహించేలా జిల్లాలో మహిళా సంఘాలకు రెండు పెట్రోల్ బంకులను కూడా మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. పెట్రోల్ బంకుల నిర్వహణతో వారికి లాభం వస్తుందని మహిళా సంఘాల అభివృద్ధి దిశగా సాగుతాయని ఇంకా వాటికి స్థల సేకరణ చేస్తూ అధికారులు ముందుకు సాగుతున్నారు. మహిళా సంఘాలను అన్ని విధాలుగా ప్రోత్సహించేలా ఆయా గ్రామాల్లో మహిళా సంఘాలకు సొంత భవనాలు ఉంటే వారికి సౌకర్యంగా ఉంటుందని మహిళా సంఘాల భవనాలకు 221 భవనాలు మంజూరు చేసి నిర్మాణ పనులు చేస్తున్నారు. ఈ పనులన్నింటిని నవంబర్ నాటికి పూర్తి చేసి మహిళా సంఘాలకు అప్పగించాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
-పంచాయతీరాజ్ ఈఈ ఉమేశ్
‘‘ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా మహిళా సంఘాల అభివృద్ధికి ప్రోత్సహించేలా ఏర్పాటు చేస్తున్న మహిళా సంఘాల భవనాలను నవంబర్ నాటికి పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. మహిళా సంఘాల భవనాల్లో వాళ్లకు అన్ని సౌకర్యాలు కల్పిస్తూ పనులు నాణ్యతతో చేపడుతున్నట్లు తెలిపారు. ఇప్పటికే నాలుగు భవనాలు పూర్తయ్యాయని ఇంకా 31 ప్రారంభం కావాల్సి ఉందని వాటన్నింటిని త్వరగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటామన్నారు’’






