- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గోదావరి పరివాహక ప్రాంత ప్రజల్లో భయం భయం..
ప్రతి సంవత్సరం జూలై నెల వస్తుందంటే... భద్రాచలం రెవిన్యూ డివిజన్ లోని గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తారు.

దిశ, భద్రాచలం: ప్రతి సంవత్సరం జూలై నెల వస్తుందంటే... భద్రాచలం రెవిన్యూ డివిజన్ లోని గోదావరి పరివాహక ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటూ జీవిస్తారు. ఏ సమయంలో గోదావరి ముంచుకువస్తుందో అని భయంతో నిద్రలేని రాత్రులు గడుపుతారు. ముఖ్యంగా 2022 జూలై16న భద్రాచలంలో వచ్చిన 71.3అడుగుల గోదావరి, ఈ ప్రాంతాన్ని ముంచెత్తిన ఘటన గోదావరి పరీవాహక ప్రజలు ఇప్పటికి మర్చిపోలేకపోతున్నారు. మన రాష్ట్రంలో కంటే... ఎగువ రాష్ట్రాలలో కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి ఏజెన్సీ ప్రాంతం నష్టపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇదిలా ఉండగా, పోలవరం ప్రాజెక్ట్ బ్యాక్ వాటర్ కారణంగా గతంలో కంటే గోదావరి ఉదృతి మరింత పెరుగుతుంది. గత సంవత్సరం నెల రోజులకు పైగా మొదటి, రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయిలో నిలిచిపోయింది. 2022 జూలై 16 న భద్రాచలం వద్ద గోదావరి 71.3అడుగులకు చేరుకోగా, 2023 జూలై30న 51.6 అడుగులు, 2024 జూలై 27న 53.6అడుగులు మేర గోదావరికి వరద ఉదృతి రావడంతో, ఈ సంవత్సరం ఎలా ఉండబోతుందోనని ప్రజలు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల కలెక్టర్ కార్యాలయంలో గోదావరి వరదలపై అధికారులతో సమీక్షసమావేశం నిర్వహించారు.
ఇంకా రూ.150 కోట్లు నిధులు కావాలి...
భద్రాచలం శివారు ప్రాంతంలో 700 మీటర్ల మిగులు కరకట్ట పనులు పూర్తి కావాలంటే ఇంకా రూ.150కోట్లు నిధులు అవసరం ఉంటుంది. రూ.38కోట్లతో 2024 లో మిగులు కరకట్ట పనులు ప్రారంభించారు. కరకట్ట పనులు చాలా వరకూ పూర్తి అయినా.. జాతీయ రహదారిపై ఎలివేటెడ్ రోడ్డు నిర్మించాల్సి ఉండటంతో కరకట్ట పనులకు జాప్యం జరుగుతుంది. ఈ రోడ్డు నిర్మాణానికి రూ.150కోట్లు వరకూ ఖర్చయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. ఈ నిధులు త్వరగా విడుదల అయితే పనులు ప్రారంభించే అవకాశం ఉంది. ఎలివేటెడ్ రోడ్డు పూర్తి కావడానికి మరో రెండేళ్లు పట్టే అవకాశం ఉంది. అప్పటివరకూ సుభాష్ నగర్ కాలనీతో పాటు మరికొన్ని కాలనీ ప్రజలకు వరద ముప్పు తప్పదు.






