సీసీ కెమెరాల్లో చిక్కిన చైన్ స్నాచర్లు.. తిరుపతిలో షాకింగ్ ఘటన

by Ramesh Naini |   (  Updated:2026-07-06 05:29:39  IST  )

తిరుపతి నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిరెడ్డి నగర్‌లో ఒక మహిళ మెడలోంచి దుండగులు బంగారు గొలుసును అపహరించారు.

సీసీ కెమెరాల్లో చిక్కిన చైన్ స్నాచర్లు.. తిరుపతిలో షాకింగ్ ఘటన
X

దిశ, డైనమిక్ బ్యూరో: తిరుపతి నగరంలో చైన్ స్నాచర్లు మరోసారి రెచ్చిపోయారు. తాజాగా ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలోని మునిరెడ్డి నగర్‌లో ఒక మహిళ మెడలోంచి దుండగులు బంగారు గొలుసును అపహరించారు. స్థానిక పీఎన్‌ఆర్ అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటున్న పార్వతి అనే మహిళ, పక్క వీధిలో ఉన్న తన కూతురింటికి వెళ్లి వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఆమె నడుచుకుంటూ వస్తున్న సమయంలో బైక్ పై వచ్చిన దుండగులు క్షణాల్లో ఆమె మెడలోని 36 గ్రాముల చైన్‌ను లాక్కెళ్లారు. ఈ చోరీకి సంబంధించిన దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యాయి. దీనిపై బాధితురాలు ఎస్వీ యూనివర్సిటీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ షాకింగ్ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు ముమ్మరం చేశారు.

Next Story