Nagarjuna: జూలై 10 తర్వాతే ఆ విషయంపై క్లారిటీ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

by Pulgam srinivas |

నాగార్జున 100వ సినిమా అప్డేట్‌కు డేట్ ఫిక్స్.. జూలై 10 తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తానన్న కింగ్

Nagarjuna: జూలై 10 తర్వాతే ఆ విషయంపై క్లారిటీ.. ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఫ్యాన్స్
X

దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం తన కెరీర్‌లో ఎంతో ప్రతిష్టాత్మకమైన 100వ చిత్రంలో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే ప్రారంభమై చాలా రోజులైనా, ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి అప్డేట్ విడుదల కాలేదు. దీంతో అభిమానులు ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. కొద్ది రోజుల క్రితం అఖిల్ మాట్లాడుతూ.. నాగార్జున 100వ చిత్రం నెక్స్ట్ లెవెల్‌లో ఉండబోతోందని, ఆయన కెరీర్‌లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న సినిమాల్లో ఇదొకటిగా నిలుస్తుందని చెప్పాడు.

ఇదిలా ఉంటే, నిన్న రాత్రి అఖిల్ హీరోగా నటించిన 'లెనిన్' ప్రీ-రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగార్జునను యాంకర్ సుమ.. "మీ 100వ సినిమా గురించి ఏదైనా అప్డేట్ ఇస్తారా?" అని ప్రశ్నించగా, "జూలై 10 తర్వాత ఆ సినిమా గురించి మాట్లాడతాను" అని సమాధానం ఇచ్చారు. దీంతో అక్కినేని అభిమానుల్లో మరింత ఆసక్తి నెలకొంది. అదే రోజున అఖిల్ నటించిన 'లెనిన్' చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో జూలై 10 కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Next Story