- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బల్ల గుద్ది చెప్తున్నా... ఈసారి అఖిల్ నిరాశ పరచడు అంటున్న నాగవంశీ.. అదృష్టం కలిసొచ్చేనా?
అఖిల్‌ను చూసి బయట అందరూ చాలా అహంకారం ఉన్న వ్యక్తి అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే.. నేను ఆయనకు స్టార్ హోదా తాలూకు గర్వాన్ని, నఖ్రాలను చూపించాను.

దిశ, సినిమా: అక్కినేని అఖిల్ ‘ఏజెంట్’ డిజాస్టర్ తర్వాత కొంతకాలం బ్రేక్ తీసుకుని ‘లెనిన్’ చిత్రంతో మళ్లీ గట్టి కంబ్యాక్ ఇచ్చేందుకు సిద్ధమయ్యారు. మురళీ కిషోర్ అబ్బూరు తెరకెక్కించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామాలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటించారు. ఇందులో సీనియర్ నటుడు శివాజీ హీరో ఫాదర్ క్యారెక్టర్‌లో నటించగా.. రాంకీ, సునీల్, బ్రహ్మాజీ, ఈశ్వరీ, గెటప్ శ్రీను, సుదర్శన్ కీలక పాత్రలో కనిపించనున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్, అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. రాయసీమ రూరల్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ మూవీపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ హైప్ క్రియేట్ చేయగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 10 థియేటర్స్‌లోకి రాబోతోంది. ఈనేపథ్యంలో.. తాజాగా, మూవీ మేకర్స్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న నిర్మాత నాగవంశీ ఆసక్తికర కామెంట్స్ చేశారు.
‘‘అఖిల్‌ను చూసి బయట అందరూ చాలా అహంకారం ఉన్న వ్యక్తి అనుకుంటారు. కానీ నిజం చెప్పాలంటే.. నేను ఆయనకు స్టార్ హోదా తాలూకు గర్వాన్ని, నఖ్రాలను చూపించాను. ఒకానొక దశలో నేను అఖిల్ చేసే ఫోన్ కాల్స్ కూడా ఆన్సర్ చేసేవాడిని కాదు’’ అని అన్నారు. అలాగే ‘లెనిన్’ గురించి మాట్లాడుతూ.. మన ఎడిటర్ నవీన్ నూలి గురించి నేను ఇప్పుడే ఎక్కువ మాట్లాడితే అందరూ నన్ను తిడతారు.. కానీ ఒక్కటి మాత్రం నిజం. సినిమా ఇంటర్వెల్, లాస్ట్ 40 నిమిషాలు చూసి మీరంతా కంగుతింటారు. థియేటర్లలో ప్రేక్షకులకు రెండు మూడు సార్లు ఊహించని సర్ప్రైజ్‌లు ఎదురవుతాయి. నేను బల్ల గుద్ది మరీ చెప్తున్నా.. ఈసారి మాత్రం అఖిల్ మిమ్మల్ని అస్సలు నిరాశపరచడు. ఖచ్చితంగా పెద్ద హిట్ కొడుతున్నాం’’ అని చెప్పడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. నెటిజన్లు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అఖిల్ అదృష్టం కలిసొచ్చి ‘లెనిన్’ హిట్ అందుకోకపోతే ఆయన సినీ కెరీర్ ముగిసినట్టే అని అభిప్రాయపడుతున్నారు.






