- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
యాష్ రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌కు గట్టి షాక్.. చతికిలపడ్డ 'ఆల్ఫా'
తొలి రెండు రోజుల్లో ఆల్ఫా చిత్రానికి రూ.21 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే దక్కాయి.

దిశ, వెబ్ డెస్క్: బాలీవుడ్‌లోని ప్రముఖ నిర్మాణ సంస్థల్లో ఒకటైన యాష్ రాజ్ ఫిల్మ్స్ చాలా కాలంగా 'స్పై' యూనివర్స్‌లో సినిమాలను రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ఈ యూనివర్స్ ప్రారంభమైన తర్వాత తొలి చిత్రాలు అద్భుతమైన విజయాలను అందుకుని ప్రేక్షకాదరణ పొందాయి. అయితే ఇటీవల ఈ బ్యానర్ నుంచి వస్తున్న 'స్పై' జోనర్ చిత్రాలు ప్రేక్షకులను ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోతున్నాయి. ఆఖరుగా విడుదలైన 'వార్ 2' కూడా ప్రేక్షకులను తీవ్ర నిరాశకు గురి చేసింది. తాజాగా ఈ బ్యానర్ ఆలియా భట్ ప్రధాన పాత్రలో 'ఆల్ఫా' అనే స్పై థ్రిల్లర్‌ను రూపొందించింది.
ఈ చిత్రంలో శర్వరి, బాబీ డియోల్, అనిల్ కపూర్ కీలక పాత్రలు పోషించగా, హృతిక్ రోషన్ అతిథి పాత్రలో మెరిశారు. శివ్ రవైల్ దర్శకత్వం వహించిన ఈ సినిమా జూలై 3న భారీ అంచనాల నడుమ విడుదలైంది. అయితే విడుదలైన తర్వాత ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోతోంది. తొలి రెండు రోజుల్లో భారతదేశవ్యాప్తంగా రూ.21 కోట్ల నెట్ కలెక్షన్లు మాత్రమే సాధించినట్లు చిత్ర బృందం అధికారిక పోస్టర్ ద్వారా వెల్లడించింది. ఇప్పటికే ఈ సినిమాకు నెగిటివ్ టాక్ రావడంతో, రానున్న రోజుల్లో కూడా భారీ వసూళ్లు సాధించడం కష్టమేనని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. దీంతో యాష్ రాజ్ ఫిల్మ్స్ 'స్పై' యూనివర్స్‌కు మరో ఎదురుదెబ్బ తగిలిందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.






