హీరో నుంచి నిర్మాతగా మారిన ప్రదీప్ రంగనాథన్.. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో భారీ సర్‌ప్రైజ్

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-06 05:50:44  IST  )

ప్రదీప్ రంగనాథన్ సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అనేవాలా... స్టార్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేయగా ఈ సినిమాకు కథను కూడా ప్రదీప్ స్వయంగా అందించడం విశేషం.

హీరో నుంచి నిర్మాతగా మారిన ప్రదీప్ రంగనాథన్.. టైటిల్ అనౌన్స్‌మెంట్‌తో భారీ సర్‌ప్రైజ్
X

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో ప్రదీప్ రంగనాథన్ వరుస హిట్స్ సాధించి సౌత్ ఇండస్ట్రీలో సెన్సేషన్ క్రియేట్ చేశారు. ఇక ఇటీవల భారీ అంచనాల మధ్య వచ్చిన ‘లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ’ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ఈ మూవీ నిర్మాతలకు నష్టాలను మిగల్చడంతో, ప్రదీప్ రంగనాథన్ తన రూట్ మార్చి ఒక సరికొత్త నిర్ణయం తీసుకున్నారు. ఎలాగైనా సరే గట్టి హిట్ కొట్టాలనే కసితో ఆయన నటనకు కాస్త బ్రేక్ ఇచ్చి, నిర్మాతగా కొత్త ప్రయాణం షురూ చేసి ఓ వైవిధ్యమైన సినిమాను తెరకెక్కిస్తున్నట్లు గత కొద్ది కాలంగా వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలైనట్లు ప్రచారం జరుగుతోంది. ఈనేపథ్యంలో తాజాగా, ప్రదీప్ ఈ ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటిస్తూ సినిమా టైటిల్, ఒక క్రేజీ గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేశారు. ప్రదీప్ రంగనాథన్ సొంతంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘అనేవాలా... స్టార్’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను ఖరారు చేయగా ఈ సినిమాకు కథను కూడా ప్రదీప్ స్వయంగా అందించడం విశేషం. ప్రముఖ దర్శకుడు అశ్వత్ మారిముత్తు ఈ సినిమా ద్వారా హీరోగా పరిచయం అవుతున్నారు. ప్రదీప్ రంగనాథన్ PRNEXTWAVE సంస్థను ప్రారంభించగా.. PRS1 పేరుతో తెరకెక్కనుంది.

అలాగే సీనియర్ నటి స్వాసిక, కొత్త నటి అనమికా మహి, శివాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను ఒకరు కాదు, ఇద్దరు కాదు.. 'ఆల్ఫా యూనిట్' పేరుతో ఉన్న ఆరుగురు దర్శకులు కలిసి డైరెక్ట్ చేయబోతున్నారు. ఇది పూర్తిగా లేడీ ఓరియెంటెడ్ సినిమాగా రూపొందనుందని సమాచారం. అయితే ఇందులో 'ప్రేమలు' బ్యూటీ మమితా బైజు మెయిన్ లీడ్ రోల్‌లో నటిస్తున్నారు. ప్రదీప్, మమిత కాంబినేషన్‌లో వస్తున్న రెండో సినిమా ఇది. అయితే ఈసారి వీరిద్దరూ తెరపై జంటగా కాకుండా.. నిర్మాతగా, నటిగా కలిసి వర్క్ చేస్తుండటం విశేషం. మూవీ టీమ్ రిలీజ్ చేసిన స్పెషల్ వీడియో ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఇందులో మమితా బైజు చేతిలో కత్తి పట్టుకుని వైల్డ్ లుక్‌లో లేడీ డాన్ లా కనిపించి షాక్ ఇచ్చింది. ఆమె కత్తితో రక్తం చిందించి అశ్వత్‌ వైపు విసరడం, ఆయన దాన్ని అందుకుని మ్యూజిక్ డైరెక్టర్ సాయి అభ్యంకర్‌కు పాస్ చేయడం ఆసక్తిగా ఉంది. ఆ తర్వాత స్వాసిక, శివాజీ లుక్స్‌ను రివీల్ చేశారు. చివర్లో ప్రదీప్ రంగనాథన్ అదిరిపోయే రేంజ్‌లో ఎంట్రీ ఇచ్చారు. ఈ వీడియోకు సాయి అభ్యంకర్ ఇచ్చిన మాస్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సినిమాపై అంచనాలను ఒక్కసారిగా పెంచేసింది.


Next Story