చరిత్ర సృష్టించిన మధ్యప్రదేశ్ సర్కార్.. వక్ఫ్ బోర్డులో హిందూ సభ్యులకు స్థానం

by Kema Shiva Kumar |

మధ్యప్రదేశ్ స్టేట్ వక్ఫ్ బోర్డులో చారిత్రాత్మక మార్పు చోటుచేసుకుంది.

చరిత్ర సృష్టించిన మధ్యప్రదేశ్ సర్కార్.. వక్ఫ్ బోర్డులో హిందూ సభ్యులకు స్థానం
X

దిశ, వెబ్‌డెస్క్: మధ్యప్రదేశ్ (Madhya Pradesh) ప్రభుత్వం చరిత్ర సృష్టించింది. రాష్ట్ర వక్ఫ్ బోర్డును (Madhya Pradesh Waqf Board) పునర్వ్యవస్థీకరిస్తూ, అందులో తొలిసారిగా ముస్లిమేతర.. అంటే హిందువులకు సభ్యులకు స్థానం కల్పించింది. సాధారణంగా ముస్లిం వర్గానికి చెందిన ప్రతినిధులు మాత్రమే ఉండే ఈ బోర్డులోకి న్యాయ నిపుణులు, ప్రభుత్వ అధికారుల కోటా కింద హిందూ సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. అయితే, రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం.. వఖ్ఫ్ బోర్డు నిర్వహణ, ఆస్తుల పరిశీలన, చట్టపరమైన ప్రక్రియలను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సీఎం మోహన్ యాదవ్ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం చెబుతోంది.

హిందూ సభ్యుల నియామకం..

వక్ఫ్ బోర్డులో ఖాళీగా ఉన్న ప్రభుత్వ ప్రతినిధులు, రిజిస్ట్రేషన్ శాఖ అధికారులు, న్యాయ నిపుణుల విభాగంలో సజీవ్ శ్రీవాస్తవ అనే సబ్-రిజిస్ట్రార్ స్థాయి అధికారితో పాటు మరికొందరు ముస్లిమేతర సభ్యులను బోర్డులో చేర్చారు. కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా వక్ఫ్ చట్టంలో సవరణలు (Waqf Act Amendments) తీసుకురావడానికి ప్రయత్నిస్తున్న తరుణంలో మధ్యప్రదేశ్ సర్కార్ తీసుకున్న నిర్ణయం ఇండియన్ పొలిటికల్ సర్కిల్‌లో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story