ఫుల్ జోష్‌లో రజనీ 'ధర్మన్'.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు

by Pulgam srinivas |

రజనీ 'ధర్మన్: ది డెడ్లీ డాక్టర్' షూటింగ్ శరవేగంగా కొనసాగుతున్నట్లు దర్శకుడు అశ్వత్ మరిముత్తు తాజా ఫొటోతో క్లారిటీ ఇచ్చారు.

ఫుల్ జోష్‌లో రజనీ ధర్మన్.. ఒక్క ఫొటోతో క్లారిటీ ఇచ్చిన దర్శకుడు
X

దిశ, వెబ్ డెస్క్: సూపర్ స్టార్ రజనీకాంత్ ప్రస్తుతం 'జైలర్ 2' చిత్రంలో హీరోగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ దాదాపు చివరి దశకు చేరుకుంది. దీంతో ఈ చిత్రాన్ని ఈ ఏడాది అక్టోబర్ 15న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. 'జైలర్ 2'తో పాటు రజనీకాంత్, 'డ్రాగన్' ఫేమ్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ధర్మన్: ది డెడ్లీ డాక్టర్' చిత్రంలో కూడా నటిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం విడుదలైన ఈ సినిమా పోస్టర్ ప్రేక్షకుల నుంచి విశేష స్పందనను అందుకుంది. తాజాగా దర్శకుడు అశ్వత్ మరిముత్తు తన ఎక్స్ ఖాతాలో షూటింగ్ లొకేషన్‌కు సంబంధించిన ఓ ఫొటోను షేర్ చేస్తూ "From the sets of Dharman" అనే క్యాప్షన్‌ను జత చేశారు. దీంతో ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా కొనసాగుతున్నట్లు స్పష్టమైంది. ఈ చిత్రంలో సిమ్రాన్, రాశి ఖన్నా, యోగి బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాను రాజ్ కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై కమల్ హాసన్ నిర్మిస్తున్నారు.




Next Story