దేశంలో భారీ సెక్స్ రాకెట్ బట్టబయలు.. లగ్జరీ రిసార్టులో మొత్తం 52 మంది అరెస్ట్

by Kema Shiva Kumar |

Jim Corbett Resort Raid, Uttarakhand Sex Racket, Ramnagar Luxury Resort Busted, Anti Human Trafficking Unit, Meerut Businessman Arrested, Uttarakhand Tourism News

దేశంలో భారీ సెక్స్ రాకెట్ బట్టబయలు.. లగ్జరీ రిసార్టులో మొత్తం 52 మంది అరెస్ట్
X

దిశ, వెబ్‌డెస్క్: ఉత్తరాఖండ్‌ రాష్ట్రంలోని ప్రపంచ ప్రసిద్ధి చెందిన జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ (Jim Corbett National Park) ప్రవేశ ద్వారమైన రామ్‌నగర్‌ (Ram Nagar)లోని ఓ ప్రముఖ లగ్జరీ రిసార్ట్‌లో జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలను పోలీసులు గుట్టురట్టు చేశారు. టూరిజం ముసుగులో నిర్వహిస్తున్న ఓ భారీ సెక్స్ రాకెట్, రేవ్ పార్టీపై యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ (AHTU), స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (SOG), రామ్‌నగర్ పోలీసులు జాయింట్ ఆపరేషన్‌‌లో భాగంగా మెరుపు దాడులు చేశారు. ఈ ఆపరేషన్‌లో ఏకంగా 52 మందిని అరెస్ట్ చేయగా, ఓ మైనర్ బాలికతో సహా 10 మంది మహిళలను అధికారులు రక్షించారు.

నోట్ల వర్షం.. అశ్లీల నృత్యాలు

అయితే, విశ్వసనీయ సమాచారం ప్రకారం ఇతర రాష్ట్రాల నుంచి అందంగా ఉన్న అమ్మాయిలు, విదేశీ మహిళలను రిసార్టుకు రప్పించి వారితో వ్యభిచారం నడుపుతున్నారు. పోలీసులు దాడి చేసిన సమయంలో అక్కడ లిక్కర్ పార్టీ (Liquor Party) జరుగుతోంది. మహిళలతో అశ్లీల నృత్యాలు చేయిస్తూ, అక్కడకు వచ్చిన విటులు సదరు మహిళపై విచ్చలవిడిగా నోట్ల వర్షం కురిపిస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. ఘటనా స్థలం నుంచి భారీగా అభ్యంతరకర సామగ్రితో పాటు లిక్విండ్ క్యాష్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ సెక్స్ రాకెట్‌కు సూత్రధారి ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌కు చెందిన పెస్టిసైడ్స్ వ్యాపారవేత్త ఉమేంద్ర కుమార్‌గా తేలింది. తన బిజినెస్ అసోసియేట్స్ కోసం జూలై 4, 5 తేదీల్లో దాదాపు రూ.2.20 లక్షలు చెల్లించి లగ్జరీ రిసార్ట్‌ను బుక్ చేసినట్లుగా విచారణలో అంగీకరించాడు. పార్టీకి అటెండ్ అయిన ప్రతి మహిళకు రూ.10 వేల చొప్పున రేటు ఫిక్స్ చేసినట్లుగా పోలీసులు గుర్తించారు.

నిందితులపై పోక్సో సహా కేసులు నమోదు..

కాగా, ఈ తంతులో రిసార్ట్ యాజమాన్యం కూడా భాగస్వామి అయినట్లుగా తెలుస్తోంది. రిసార్ట్ జనరల్ మేనేజర్, అక్కడకు వచ్చే విటుల పేర్లను కానీ, మహిళల వివరాలను కానీ విజిటర్స్ రిజిస్టర్‌లో నమోదు చేయవద్దని సిబ్బందిని ఆదేశించినట్లుగా విచారణలో తేలింది. సాక్ష్యాలను ఉద్దేశపూర్వకంగా ధ్వంసం చేసేందుకు ప్రయత్నించినందుకు గానూ పోలీసులు సదరు లగ్జరీ రిసార్ట్‌ను పూర్తిగా సీజ్ చేశారు. అదేవిధంగా నిందితులపై బీఎన్ఎస్ యాక్ట్ ప్రకారం వ్యభిచార నిరోధక చట్టం, పోక్సో (POCSO) చట్టం, ఎక్సైజ్ యాక్ట్ కింద కేసులు నమోదు చేశారు.

Next Story