- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నటుడు మోహన్‌లాల్ వద్ద 10 ఏనుగు దంతాలు.. ఐటీ శాఖ డిక్లరేషన్‌లో వెల్లడి
మలయాళ ఫిల్మ్ ఇండస్ట్రీలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: దాదా సాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత, మళయాల సూపర్ స్టార్ మోహన్‌లాల్ (Mohan Lal)ను కొన్నేళ్లుగా వెంటాడుతున్న ఏనుగు దంతాల నిల్వ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆదాయపు పన్ను శాఖకు మోహన్‌లాల్ గతంలో సమర్పించిన వాలంటరీ డిస్క్లోజర్ స్కీమ్ నివేదిక ప్రకారం.. ఆయన వద్ద మొత్తం 10 ఏనుగు దంతాలు (Elephant Tusks), 13 దంతపు విగ్రహాలు ఉన్నట్లు అధికారికంగా డిక్లేర్ చేసిన పత్రాలు ఇప్పుడు కేరళ హైకోర్టు ముందుకొచ్చాయి.
పదేళ్లుగా నడుస్తున్న వివాదం..
2011 జూన్ నెలలో మోహన్‌లాల్ ఇళ్లు, కార్యాలయాలపై ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆకస్మిక సోదాలు నిర్వహించారు. ఈ సోదాల్లో కొచ్చిలోని ఆయన నివాసంలో 4 ఏనుగు దంతాలు లభ్యమయ్యాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం ప్రకారం అనుమతి లేకుండా ఏనుగు దంతాలను కలిగి ఉండటం నేరం కావడంతో కేరళ అటవీ శాఖ (Kerala Forest Department) ఆయనపై కేసు నమోదు చేసింది. అయితే, ఈ కేసుకు సంబంధించి కోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరుగుతున్నాయి. తాజాగా, కేసులో భాగంగా మోహన్‌లాల్ తరపున సమర్పించిన నివేదికల ప్రకారం.. తాను అటవీ చట్టాలను ఉల్లంఘించలేదని, రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన అమ్నెస్టీ (Ivory Amnesty) పథకం కింద ఆస్తులను ముందే డిక్లేర్ చేశానని మోహన్‌లాల్ కోర్టుకు వివరించారు. కానీ, మోహన్‌లాల్ తన వద్ద ఉన్న దంతాల వివరాలను ఐటీ శాఖకు వెల్లడించినప్పటికీ, అటవీ శాఖ నుంచి వీటికి సంబంధించిన లీగల్ ఓనర్‌షిప్ సర్టిఫికేట్ (Ownership Certificate) సరైన సమయంలో పొందారా లేదా అనే అంశంపైనే ప్రస్తుతం హైకోర్టులో విచారణ ఉత్కంఠగా కొనసాగుతోంది.






