అంధకారంలో ప్రభుత్వ కార్యాలయాలు..

by Kodari Anjali |

మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలైన, ఎంపీడీఓ, తాహసీల్దార్, పోలీస్ స్టేషన్ బయట రాత్రి సమయంలో లైట్లు వెలగక చిమ్మ చీకటిగా తయారయ్యాయి.

అంధకారంలో ప్రభుత్వ కార్యాలయాలు..
X

దిశ, ఏన్కూర్: మండల కేంద్రంలోని ప్రభుత్వ కార్యాలయాలైన, ఎంపీడీఓ, తాహసీల్దార్, పోలీస్ స్టేషన్ బయట రాత్రి సమయంలో లైట్లు వెలగక చిమ్మ చీకటిగా తయారయ్యాయి. ప్రధాన రహదారిపై ప్రయాణిస్తున్న ప్రయాణికులకు ఇవి ప్రభుత్వ కార్యాలయాల, లేక పాడుబడ్డ బంగ్లాల అన్న అనుమానం తలెత్తుతుంది. పలువురుకు ఆదర్శంగా నిలవాల్సిన కార్యాలయాల్లో రాత్రి సమయంలో లైట్లు వెలిగే పరిస్థితి లేదంటే వారు పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవాల్సిన ఉందని స్థానికులు చర్చించుకుంటున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు బాధ్యత గుర్తించి రాత్రి సమయంలో కార్యాలయాల దగ్గర లైట్లు వెలిగే విధంగా చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Next Story