- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TODAY’S HOROSCOPE: నేటి (06-07-2026)నేటి రాశిఫలాలు
జులై 6 వ తారీకున రాశిఫలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం...

మేష రాశి: మీ భాగస్వామితో ఎక్కువ సమయం గడుపుతారు. ఎక్కువగా పాటలు వింటారు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపడుతాయి. పెద్దల సలహాలు తీసుకుని ముందడుగు వేస్తారు. స్నేహితులతో ముఖ్యమైన విషయాలు చర్చిస్తారు.
వృషభ రాశి: ఎక్కువగా కుటుంబ సభ్యులతో గడుపుతారు. ఖాళీగా ఉండకుండా తరచూ ఏదొక పని చేయాలనే ఆరాటం ఉంటుంది. నేడు ఆర్థికంగా దూసుకుపోతారు. ఎక్కువగా వంటలు ప్రిపేర్ చేయడానికి ఇష్టపడుతారు. ఆఫీసులో కాస్త నీరసంగా ఉంటారు. వ్యాపారంలో పెట్టుబడులు పెట్టేముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించడం మంచిది. మీ భాగస్వామితో కాస్త గొడవకు దిగుతారు.
మిథున రాశి: వ్యక్తిగత సమస్యలు మానసిక ప్రశాంతతను పాడుచేస్తాయి. వ్యాయామాలు మానసిక ఒత్తిడికి దూరం చేస్తాయి. ఎక్కువగా పుస్తకాలు చదువుతారు. ధనం పొదుపు చేస్తారు. కానీ మీకు తెలువకుండానే డబ్బు ఖర్చు అవుతుంది. దానం చేస్తే మంచి జరుగుతుంది. వైవాహిక జీవితంలో పలు సమస్యలు వస్తాయి. చిన్న విషయాలకే ఆందోళన చెందుతారు.
కర్కాటక రాశి: చాలా దగ్గర వాళ్లే మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కొత్త స్నేహితులను పరిచయం చేసుకుంటారు. యోగా చేస్తారు. ఉద్యోగ రంగాల్లో ప్రశంసలు అందుకుంటారు. మీ భాగస్వామి మీపై ఎనలేని ప్రేమ కురిపిస్తారు. కాస్త డబ్బుల విషయంలో భార్యభర్తల మధ్య గొడవలు వస్తాయి. కారణం లేకుండా ఇతరులతో మనస్పర్థలు ఏర్పడుతాయి.
సింహ రాశి: పెద్దవారి సలహాలు తీసుకోకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోవద్దు. మీ భాగస్వామితో సినిమాకు వెళ్తారు. ఆర్థికంగా అంతా బాగుంటుంది. వైవాహిక జీవితాన్ని మెరుగు పర్చుకోవడానికి చేసిన ప్రయత్నానికి ఫలితం దక్కుతుంది. నేడు రోజంతా నవ్వుకుంటూ ఉంటారు.
కన్యా రాశి: ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు పాటించడం బెటర్. ప్రేమలో పడుతారు. వైవాహిక జీవితంలో కొత్త ప్రేమ చిగురిస్తుంది. కానీ ఆర్థికంగా నష్టపోతారు. అనవసరపు ఖర్చులు పెరుగుతాయి. మొక్కలు నాటేందుకు ఇష్టపడుతారు.
తులా రాశి: కోపాన్ని తగ్గించుకుని సహనంగా ఉంటే మంచిది.ప్రశాంతత కోసం పార్కుకు వెళ్తారు. ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి. ఇష్టమైన వారికి గిఫ్టులు ఇస్తారు. ఆఫీసులో మంచి పేరు సంపాదించుకుంటారు. ఎవరితోనైనా హద్దులుదాటి జోకులు వేయవద్దు. దీంతో మీ రిలేషన్ దెబ్బతింటుంది. వైవాహిక జీవితం బాగుంటుంది.
వృశ్చిక రాశి: ఇతరులకు సహాయం చేస్తారు. ఆఫీస్ వర్క్ కారణంగా ఎక్కువగా స్ట్రెస్ కు గురవుతారు. పుస్తకాలు చదువుతారు. తల్లిదండ్రుల నిర్ణయం తీసుకుంటారు. మీకు ఇష్టమైన వారితో సమయం గడుపుతారు. మీ భాగస్వామితో అన్ని విషయాలు చెప్పుకుంటారు. ఆర్థికంగా ఇప్పుడిప్పులే పుంజుకుంటారు.
ధనుస్సు రాశి: మీ భాగస్వామితో కలిసి జోక్స్ వేసుకుంటారు. ఎవరేంటో నేడు తెలుసుకుంటారు. ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. దూరపు చుట్టాలు ఇంటికి వస్తారు. వ్యాపారంలో పెట్టిన పెట్టుబడి కన్నా ఎక్కువ లాభం వస్తుంది.
మకర రాశి: సెమినార్స్ ఇస్తారు. ఉద్యోగ అవకాశాలు వస్తాయి. భాగస్వామితో రొమాంటిక్ సాయంత్రాన్ని గడుపుతారు. మిమ్మల్ని మీ భాగస్వామి ఊహించని బహుమతితో సర్ప్రైజ్ చేస్తారు. చుట్టుపక్కన వారితో మనస్పర్థలు వస్తాయి. తరచూ మొబైల్ చూస్తారు. ఆర్థికంగా జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోయే అవకాశం ఉంది.
కుంభ రాశి: కష్టపడి పని చేస్తారు. భాగస్వామితో ఉద్యోగం కోసం చాలా కష్టపడి చదువుతారు. చిన్న చిన్న విషయాలకే ఎక్కువగా టెన్షన్ పడుతారు. ఆర్థికంగా దూసుకుపోతారు. కుటుంబ సభ్యులతో కలిసి టూర్ కు వెళ్తారు. పెద్దల సలహాలు పాటించడం మంచిది. శత్రువులు మిత్రులు అవుతారు.
మీన రాశి: పిల్లలతో ఎక్కువగా సమయం గడుపుతారు. ఓర్పుతో ఉండటం మంచిది. శక్తిని మంచిన పనులు అస్సలు చేయకూడదు.. నష్టపోతారు. కుటుంబంలో ఏ ఒక వ్యక్తి కారణంగా చాలా ఇబ్బందిపడుతారు. డబ్బులు సంపాదించుకునేందుకు మంచి మంచి ఆలోచనలు చేస్తారు. నేడు కొత్త బట్టలు ధరించి మగవారు శివయ్యకు పూజలు చేయడం వల్ల కుటుంబానికే మంచి జరుగుతుంది.






