అయోధ్య విరాళాల చోరీ ప్రకంపనలు.. ఆలయ ప్రాంగణంలోనే ట్రస్ట్ అత్యవసర భేటీ

by Kema Shiva Kumar |

అయోధ్య రామాలయ విరాళాల చోరీ ప్రకంపన నేపథ్యంలో నిర్వహించబోతున్న ట్రస్ట్ బోర్డు సమావేశం ప్రాధాన్యతను సంతరించుకుంది.

అయోధ్య విరాళాల చోరీ ప్రకంపనలు.. ఆలయ ప్రాంగణంలోనే ట్రస్ట్ అత్యవసర భేటీ
X

దిశ, వెబ్‌డెస్క్: అయోధ్య శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్‌ (Ayodhya Sri Ram Janmabhoomi Tirtha Kshetra Trust)లో విరాళాల దుర్వినియోగం, కానుకల చోరీ ఉదంతం దేశాన్ని కుదిపేస్తోంది. ఈ క్రమంలోనే నిత్యం ‘సంత్ మణిరామ్ దాస్ చావని’లో జరిగే ట్రస్ట్ బోర్డు భేటీని ఇవాళ ఉదయం నేరుగా రామమందిర సముదాయంలోనే నిర్వహించనున్నారు. ట్రస్ట్ అధ్యక్షుడు మహంత్ నృత్య గోపాల్ దాస్ (Mahant Nritya Gopal Das) అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పరిపాలన పరంగా విప్లవాత్మక నిర్ణయాలు తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. అయితే, ఇప్పటికే ట్రస్ట్ జనరల్ సెక్రెటరీ చంపత్ రాయ్, ట్రస్టీ అనిల్ మిశ్రా తమ పదవులకు రాజీనామా చేశారు. ఎఫ్‌ఐఆర్‌లో వీరి పేర్లు లేనప్పటికీ, పారదర్శక విచారణ కోసం వారు తప్పుకున్నారు. ట్రస్ట్ బైలాస్ ప్రకారం వారి రాజీనామాలను ఆమోదించాలా.. వద్దా? అనే దానిపై ట్రస్టీలు ఓటింగ్ పెట్టనున్నారు.

ఇక లెక్కింపు సమయంలో కావాలనే సీసీ టీవీ (CC TV) కెమెరాలను ఆపేసారనే ఆరోపణలపై సిట్ ఇచ్చిన మధ్యంతర నివేదికను ట్రస్ట్ పరిశీలించనుంది. కానుకల లెక్కింపు గదిలోకి స్మార్ట్‌ఫోన్లను పూర్తిగా నిషేధించే అవకాశం ఉంది. అదేవిధంగా అక్కడ పనిచేసే సిబ్బందికి జేబులు లేని ప్రత్యేక యూనిఫారాలను తప్పనిసరి చేస్తూ కఠిన నిబంధనలు తీసుకురానున్నారు. ట్రస్ట్ వ్యవస్థలో మార్పులు చేపడుతూ.. ఓ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO)తో పాటు భద్రత కోసం రిటైర్డ్ సీనియర్ పోలీసు అధికారితో విజిలెన్స్ ఆఫీసర్ పోస్టుకు తీర్మానం చేయనున్నారు.

Next Story