- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కయాదు లోహర్, ప్రీతి నటనపై ప్రశంసలు కురిపించిన అట్లీ.. ఆమెను నేషనల్ క్రష్ అంటూ కామెంట్స్
ప్రీతి ముకుందన్‌ను ఉద్దేశించి మాట్లాడిన అట్లీ.. ఆమె డాన్స్, యాక్టింగ్ స్టైల్ తనకు ఎంతగానో నచ్చుతాయని కొనియాడారు.

దిశ, సినిమా: కోలీవుడ్ యంగ్ హీరో అథర్వ మురళి, కయాదు లోహర్ జంటగా నటించిన రొమాంటిక్ కమింగ్-ఆఫ్-ఏజ్ డ్రామా ‘ఇదాయం మురళి’. ఇందులో ప్రీతి ముకుందన్, ఫహద్ ఫాజిల్ కీలక పాత్రలో కనిపించనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో రాబోతున్న ఈ చిత్రాన్ని తెలుగులో మైత్రీ మూవీ మేకర్స్ విడుదల చేస్తుండగా.. షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 10న థియేటర్స్‌లోకి రాబోతుంది. ఈనేపథ్యంలో.. తాజాగా, చిత్రబృందం ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించగా.. ఇందులో పాల్గొన్న కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీ ఇందులో హీరోయిన్లుగా నటించిన ప్రీతి ముకుందన్, కయాదు లోహర్‌పై ప్రశంసలు కురిపిస్తూ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రీతి ముకుందన్‌ను ఉద్దేశించి మాట్లాడిన అట్లీ.. ఆమె డాన్స్, యాక్టింగ్ స్టైల్ తనకు ఎంతగానో నచ్చుతాయని కొనియాడారు. గతంలో తన సినిమాలో ఒక క్యారెక్టర్ కోసం ఆమెను సంప్రదించిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు.
అయితే, అప్పటికే దర్శకుడు ఆకాష్ తెరకెక్కిస్తున్న 'ఇదాయం మురళి' చిత్రానికి డేట్స్ ఇవ్వడం వల్ల ఆమె ఆ ఆఫర్‌ను సున్నితంగా తిరస్కరించినట్లు వెల్లడించారు. ఆ సమయంలో.. సరే, మనం మన నెక్స్ట్ ప్రాజెక్ట్‌లో కలిసి వర్క్ చేద్దాం అని ఆమెతో అన్నట్లు అట్లీ పేర్కొన్నారు. ఇండస్ట్రీలో ప్రీతి ముకుందన్ గురించి అందరూ చాలా గొప్పగా చెబుతుంటారని ఆయన ప్రశంసించారు. అలాగే ఈ సినిమాలో నటించిన కయాదు లోహర్ నటనపై కూడా అట్లీ ఫిదా అయినట్లు వెల్లడించారు. 'ఇదాయం మురళి' చిత్రంలో ఆమె పర్ఫార్మెన్స్ వేరే లెవెల్‌లో ఉందంటూ అప్రిషియేట్ చేశారు. ఆమె స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ చూస్తుంటే త్వరలోనే కాయదు లోహర్ దేశవ్యాప్తంగా నేషనల్ క్రష్ అవ్వడం ఖాయమని అట్లీ చెప్పారు. స్టార్ డైరెక్టర్ నుండి ఇలాంటి ప్రశంసలు దక్కడంతో ఇద్దరు ముద్దుగుమ్మల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.






