- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Suresh Reddy: మా నోరు నొక్కే ప్రయత్నం
కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్టానికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు పార్లమెంట్ బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వం అండతోనే ఏపీ బనకచర్ల ప్రాజెక్ట్ కట్టాలని చూస్తున్నదని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్ ఆదేశాల మేరకు రాష్టానికి జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టేందుకు పార్లమెంట్ బీఆర్ఎస్ తరఫున పోరాటం చేస్తున్నామని.. కేంద్ర ప్రభుత్వం అండతోనే ఏపీ బనకచర్ల ప్రాజెక్ట్ కట్టాలని చూస్తున్నదని బీఆర్ఎస్ రాజ్యసభ ఫ్లోర్ లీడర్ సురేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఇప్పటికే బనకచర్లపై పార్లమెంట్‌లో వాయిదా తీర్మానం ఇచ్చామని తెలిపారు. పార్లమెంట్‌లో తమ నోరు నొక్కే ప్రయత్నం జరుగుతున్నదని ఆరోపించారు. మరోవైపు. గోదావరి జలాలు దోపిడీకి గురవుతుంటే రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతుందనే అంశాన్ని ప్రభుత్వం మర్చిపోతున్నదని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్‌పైనా కాంగ్రెస్ ప్రభుత్వం డ్రామా ఆడుతున్నదని.. టెంట్ హౌస్ పోరాటంతో కాదని.. పార్లమెంట్‌లో పోరాడాలని డిమాండ్ చేశారు.
బీసీ రిజర్వేషన్ బిల్లుపై ఏర్పాటు చేసిన ధర్నాలో ఎందుకు రాహుల్ గాంధీ, కాంగ్రెస్ అగ్రనేతలు పాల్గొనలేదని ప్రశ్నించారు. బీసీలకు సబ్‌ప్లాన్ ఎందుకు అమలు చేయడం లేదని నిలదీశారు. తాము అధికారంలో ఉన్నప్పుడు బీసీ వర్గానికి అన్నివిధాలా సహాయం అందించామని తెలిపారు. ఇరిగేషన్‌పై, బీసీ రిజర్వేషన్‌పై పార్లమెంట్‌లో పోరాటం చేస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర మాట్లాడుతూ.. ప్రతి దాంట్లో కేసీఆర్ పేరు చెప్పి రాజకీయం చేస్తున్నారని పేర్కొన్నారు. బీసీ బిల్లు తీసుకొచ్చినప్పుడు పార్లమెంట్‌లో చట్టం చేయాలని కాంగ్రెస్ నేతలకు తెలియదా అని నిలదీశారు. ఢిల్లీలో బీసీల పేరిట పెద్ద హైడ్రామా నడిచిందని.. దేనికోసం పోరాటం చేశారని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి బీసీలను ఎంతకని మోసం చేస్తారని నిలదీశారు. రాష్ట్ర ప్రజలకు ఇది ఉపయోగపడే సభ కాదని పేర్కొన్నారు.






