రోజుకు 4 వేల మంది పనిచేస్తున్నా.. కొత్త సచివాలయానికి నిర్మాణ కష్టాలు!!

by Disha Web Desk 2 |
రోజుకు 4 వేల మంది పనిచేస్తున్నా.. కొత్త సచివాలయానికి నిర్మాణ కష్టాలు!!
X

దిశ, తెలంగాణ బ్యూరో: కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి ముహూర్తం ఫిక్స్ చేసినా.. పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడం మరో ఆరు నెలల సమయం పట్టే అవకాశాలున్నాయి. రోజుకు 3 వేల నుంచి 4 వేల మంది కార్మికులు పని చేస్తున్నట్లు చెప్తున్నా.. ఇంటీరియల్ వర్క్స్ చాలా ఆలస్యమవుతున్నాయి. దీనికితోడుగా సీఎం కేసీఆర్ పరిశీలించినప్పుడల్లా మార్పులు అనివార్యమవుతున్నాయి. దీంతో నిర్మాణ పనులు నెమ్మదిస్తున్నట్లు అధికారులు చెప్తున్నారు. వచ్చే ఏడాది జనవరి 18న సచివాలయాన్ని ప్రారంభించనున్నట్లు సీఎంఓ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, కేవలం ఆరో అంతస్థులోని సీఎం చాంబర్ వరకే ప్రారంభం చేయనున్నారు. సచివాలయాన్ని ప్రారంభించినట్లుగా మొత్తంగా శిలాఫలకాలన్నీ వేసి, సీఎం చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి, పూజలు నిర్వహించి, ఆ తర్వాత మళ్లీ నిర్మాణ పనుల్లో నిమగ్నం కానున్నారు.

ఇంకో ఆరు నెలల వరకూ పనులు

నూతన సచివాలయం పనులు ప్రస్తుతం 70 శాతం వరకే పూర్తయ్యాయి. ప్రధాన పనులు పూర్తికావచ్చినా.. ఇంటీరియల్ వర్క్స్ మాత్రం చాలా మేరకు పెండింగ్ ఉన్నాయి. మరోవైపు సోలార్ పవర్ జనరేషన్ ఇంకా ఆదిలోనే ఉంది. మంత్రులు, ఉన్నతాధికారుల చాంబర్లు చాలా వరకు రెడీ కాలేదు. అయితే, ప్రభుత్వం నుంచి ఒత్తిడి పెరుగుతుండటంతో.. ముందుగా ప్రారంభోత్సవం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు చెప్తున్నారు. దీనిలో భాగంగా వచ్చేనెల గ్రాండ్‌గా ఓపెనింగ్ చేసి, సీఎం చాంబర్‌లో కొద్ది గంటల పాటు విధులు నిర్వర్తించనున్నట్లు తెలుస్తోంది.

ఆ తర్వాత కూడా చాలా పనులు చేయాల్సి రావడంతో.. పనులు కొనసాగనున్నాయి. జనవరిలో ఓపెనింగ్​చేసినా.. ఫంక్షనింగ్​ మాత్రం జూన్​ వరకు పడుతుందని అధికారులు ఆఫ్​ది రికార్డుగా చెప్తున్నారు. అప్పటి వరకు సచివాలయం బీఆర్‌కే భవన్‌లోనే కొనసాగనుంది.

మార్పులతో ఆలస్యం

వాస్తవానికి మొత్తం పనులు కంప్లీట్​చేసిన తర్వాతే సచివాలయాన్ని ప్రారంభించాలని భావించారు. సీఎం కేసీఆర్​కూడా ముందు నుంచీ అదే ప్రకటించారు. కానీ, నిర్మాణ పనులు ఆలస్యమవుతున్నాయి. ప్రధానంగా సీఎం కేసీఆర్​పలుమార్లు సచివాలయ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంలో పలు కీలక మార్పులు చూపించడంతో వర్క్స్​మళ్లీ ముందుకొస్తున్నాయి. ఇలా పలు కీలక పనులకు బ్రేక్ పడినట్లు అధికారులు చెప్తున్నారు. అంతేకాకుండా ఈ నిర్మాణ పనులపై సీఎం నేరుగా సమీక్షిస్తుండటంతో కూడా ఆటంకాలు వచ్చాయనే ప్రచారం కూడా ఉంది. తాజాగా ఇటీవల పనులను పరిశీలించిన సీఎం కేసీఆర్​.. ఇంటీరియల్​ వర్క్స్​ విషయంలో కొన్ని మార్పులను సూచించినట్లు అధికారులు చెప్తున్నారు. దీంతో కొన్ని చాంబర్లలో చేసిన పనులను తొలిగించి, మళ్లీ చేస్తున్నట్లు వివరించారు.

Read more:

మోగుతున్న ముందస్తు సైరన్


Next Story

Most Viewed