Dasoju : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానిస్తున్నారు : దాసోజు

by Y. Venkata Narasimha Reddy |

బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) మీద రాజకీయ కక్షతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్(Ambedkar)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అవమానిస్తున్నారని బీఆర్ఎస్(BRS) నేత దాసోజు శ్రవణ్ కుమార్(Dasoju Shravan)విమర్శించారు.

Dasoju : రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ ను అవమానిస్తున్నారు : దాసోజు
X

దిశ, వెబ్ డెస్క్ : బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్(KCR) మీద రాజకీయ కక్షతో రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్(Ambedkar)ను సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అవమానిస్తున్నారని బీఆర్ఎస్(BRS) నేత దాసోజు శ్రవణ్ కుమార్(Dasoju Shravan)విమర్శించారు. బీఆర్ఎస్ నేతలతో కలిసి దాసోజు శ్రవణ్ అంబేద్కర్ విగ్రహం(Ambedkar Statue) వద్ధ రిపబ్లిక్‌ డే సందర్భంగా నివాళులర్పించేందుకు వెళ్లారు. లోపలికి వెళ్లకుండా నిర్వాహకులు గేటుకు తాళాలు వేశారు. దీనిపై బీఆర్‌ఎస్‌ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.

గేటు వద్ద బైటాయించి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శ్రవణ్ మాట్లాడుతూ రాష్ట్ర సచివాలయం ముందు ఏర్పాటైన ప్రపంచంలోనే అతి ఎత్తైన 125అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ధ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం ప్రత్యేక ఏర్పాట్లు చేయకపోవడం బాధకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ విగ్రహ ప్రాంతంలో సిగరెట్ పీకలు, చెత్త కూడా శుభ్రం చేయించకపోవడం విచారకరమన్నారు. రాజ్యాంగ నిర్మాతకు గణతంత్ర దినోత్సం రోజున కనీసం దండ కూడా వేయకుండా సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న అవమానం బాధ కల్గిస్తుందన్నారు.

అంబేద్కర్‌ విగ్రహాన్ని రేవంత్‌ రెడ్డి బందీ చేశాడని మండిపడ్డారు. పాలకులు వస్తారు పోతారు.. అంబేద్కర్‌ చిరకాలం ఉంటారన్నారు. కేసీఆర్‌ కట్టించిన అంబేద్కర్‌ విగ్రహాన్ని పట్టింకోని రేవంత్‌ రెడ్డి.. సచివాలయంలో ఎందుకు కూర్చుంటున్నావంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మాజీ సీఎం కేసీఆర్ పై కోపంతో ఆయన ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని పట్టించుకోకపోవడం సరైన వైఖరి కాదన్నారు.

Next Story