అసెంబ్లీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు

by Naga Rani Yarlagadda |

రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో బుధవారం రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం జరిగింది.

అసెంబ్లీలో రాజ్యాంగ దినోత్సవ వేడుకలు
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర శాసనసభ భవనంలోని లాంజ్ లో బుధవారం రాజ్యాంగ దినోత్సవం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర శాసన సభాపతి గడ్డం ప్రసాద్ కుమార్, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబు, మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి అజహరుద్దీన్ పాల్గొన్నారు. వీరితో పాటు ఎమ్మెల్యేలు రాజ్ ఠాకూర్, నవీన్ యాదవ్, శ్రీ గణేష్, కార్పోరేషన్ల చైర్మన్లు, ప్రజాప్రతినిధులు మరియు లెజిస్లేచర్ సెక్రటరీ వి. నరసింహా చార్యులు తదితరలు పాల్గొన్నారు.

దేశంలో నరేంద్ర మోదీ రాజ్యాంగంపై దాడి చేస్తున్నారు : కాంగ్రెస్ అధికార ప్రతినిధి లింగం యాదవ్

దేశంలో నరేంద్ర మోడీ రాజ్యాంగం పై దాడి చేస్తున్నారని, ఆర్ఎస్ఎస్ కనుసన్నల్లో రాజ్యాంగ వ్యవస్థలపై దాడి జరుగుతోందని టీపీసీసీ అధికార ప్రతినిథి లింగం యాదవ్ విమర్శించారు. రాజ్యాంగం మార్చే కుట్రలకు మతతత్వ శక్తులు పాటుపడుతున్నాయని ఆయన ఆరోపించారు. బుధవారం గాంధీ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో లింగం యాదవ్ మాట్లాడుతూ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని రాహుల్ గాంధీ సేవ్ కాన్స్టీట్యూషన్ సేవ్ డెమక్రసీ పేరిట ఎనలేని పోరాటం చేస్తున్నారన్నారు. ప్రజాస్వామ్యం కోసం కాంగ్రెస్ ప్రజా ఉద్యమాన్ని చేపడుతోందని, రాజ్యంగ పరిరక్షణకు ప్రతి ఒక్కరు పాటుపడాలని, ప్రజాస్వామం కోసం మేధావులు, విద్యావంతులు మేల్కొవాలన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కుమార్ రావు, కైలాష్ కుమార్, అన్సారీ, మిద్దే శ్రీనివాసులు, కురుమయ్యలు పాల్గొన్నారు.

Next Story