- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డీజీపీ కార్యాలయంలో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం
by Ajay Maddhiboyina |
రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్ర డీజీపీ కార్యాలయంలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులు, సిబ్బంది భారత రాజ్యాంగం పట్ల తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ ఆధ్వర్యంలో భారత రాజ్యాంగ ప్రవేశికను గౌరవంగా పఠింపజేసి, ప్రతిజ్ఞ చేయించారు. పోలీస్ కార్యాలయ సిబ్బంది అందరూ భారత రాజ్యాంగ విలువలు, పౌర హక్కులు, బాధ్యతలు నైతిక ధర్మాలను కాపాడేందుకు కృషి చేస్తామని సంకల్పం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో అడిషలన్ డీజీపీ దేవెంద్ర సింగ్ చౌహన్ , ఏఐజి రమణ కుమార్, పోలీసు అధికారులు, డీజీపీ కార్యాలయ మినిస్టీరియల్ సిబ్బంది పాల్గొన్నారు.
Next Story






