- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గంజాయి ముఠా దాడిలో గాయపడ్డ కానిస్టేబుల్ పరిస్థితి విషమం
నిజామాబాద్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిన్ సంగతి తెలిసిందే. గంజాయి తరలిస్తుండగా పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ సౌమ్యను బ్యాచ్ కారుతో ఢీ కొట్టింది.

దిశ, వెబ్ డెస్క్: నిజామాబాద్ లో గంజాయి బ్యాచ్ రెచ్చిపోయిన్ సంగతి తెలిసిందే. గంజాయి తరలిస్తుండగా పట్టుకునేందుకు వెళ్లిన కానిస్టేబుల్ సౌమ్యను బ్యాచ్ కారుతో ఢీ కొట్టింది. దీంతో ఆమెకు తీవ్రగాయాలు అయ్యాయి. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచన మేరకు సౌమ్యను మెరుగైన చికిత్స కోసం నిమ్స్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ముఠా సభ్యులు మతిన్, రహీద్, అఫ్రోజ్ కోసం గాలిస్తున్నారు. ఇప్పటికే ఓ మైనర్ ను అదుపులోకి తీసుకున్నారు.
దాడి ఘటనపై విచారణ కమిటీ ఏర్పాటు చేయగా నివేదిక ఆధారంగా కఠిన చర్యలు తీసుకునేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. మరోవైపు ఎక్సైజ్ సీఐ స్వప్నకు గంజాయి స్మగ్లర్లతో సంబంధాలు ఉన్నాయని, అందుకే అనుభవం లేని మహిళా కానిస్టేబుళ్లకు రాత్రి వేళల్లో డ్యూటీ వేస్తుందని సిబ్బంది ఆరోపిస్తూ కార్యాలయం ముందు ధర్నాకు దిగారు. వసూళ్లకు అడ్డు వస్తున్నామనే తమపై సీఐ దాడులు చేస్తోందని చెబుతున్నారు. ప్రశాంతంగా ఉన్న నిజామాబాద్ లో గంజాయి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. మాట్లాడితే తనకు రాజకీయ నాయకుల అండదండలు ఉన్నాయని బెదిరింపులకు పాల్పడుతోందని చెప్పారు.






