- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mallu Ravi: తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారు: మల్లు రవి
తెలంగాణలో ప్రజాప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని మల్లు రవి సంచలన వ్యాఖ్యలు చేశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ప్రజా ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు చేస్తున్నారని నాగర్‌కర్నూల్ కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి (Mallu Ravi) సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీతో కలిసి బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ కలిసి పోటీ చేయబోతున్నాయని, ఈ మూడు పార్టీలు కలిసి రాష్ట్రంలో మళ్లీ ప్రజా ప్రభుత్వం అధికారంలోకి రాకుండా అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని హాట్ కామెంట్స్ చేశారు. ఇవాళ హైదరాబాద్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఎంతో మంది మాజీ ముఖ్యమంత్రులు జైలుకు వెళ్లారని, బిహార్ మాజీ సీఎం లాలుప్రసాద్ యాదవ్ జైలుకు వెళ్లలేదా? కేసీఆర్ (KCR) చట్టానికి అతీతులా అని ప్రశ్నించారు. కేసీఆర్‌కు నోటీసులకు, కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధం లేదని చెప్పారు. విద్యుత్ కమిషన్ విషయంలో కేసీఆర్ తప్పు చేశారని, ఇప్పుడైనా కేసీఆర్ కాళేశ్వరం కమిషన్‌కు (Kaleswaram Commission) సహకరించాలని సూచించారు.






