ఉద్యమ స్పూర్తిని తుంగలో తొక్కాలనే కుట్ర.. ప్రభుత్వంపై హరీష్ రావు కామెంట్స్

by Ramesh Goud |   ( Updated:2025-03-17 11:52:37.0  )
ఉద్యమ స్పూర్తిని తుంగలో తొక్కాలనే కుట్ర.. ప్రభుత్వంపై హరీష్ రావు కామెంట్స్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ ఉద్యమ స్పూర్తిని మళ్లీ తుంగలో తొక్కాలనే కుట్ర జరుగుతోందని మాజీమంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు (BRS Leader Harish Rao) అన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ అధికారులు (Osmania University Officials) జారీ చేసిన ఆంక్షల సర్క్యూలర్ (Circular) కు వ్యతిరేకంగా ఓయూ విద్యార్థి సంఘాల నాయకులు (OU Students Union Leaders) బందుకు పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే ఇవాళ యూనివర్సిటీలో అధికారులకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ.. విద్యార్ధి సంఘాల నాయకులు నిరసనకు దిగారు. దీంతో పోలీసులు రంగంలోకి దిగి ఆందోళనలు చేస్తున్న వారని అరెస్ట్ (Arrest) చేశారు. దీనికి సంబంధించిన వీడియోలను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన హరీష్ రావు.. కాంగ్రెస్ ప్రభుత్వంపై (Congress Government) ఫైర్ అయ్యారు.

దీనిపై ఆయన.. పోరాటాల పురిటిగడ్డ, తెలంగాణ ఉద్యమానికి గుండెకాయ వంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఆంక్షలు విధించడం అప్రజాస్వామికమని మండిపడ్డారు. నిరసన తెలిపే హక్కును హరిస్తూ ఆంక్షలు విధించడం అమానుషమని, ఇది పూర్తి రాజ్యాంగ విరుద్ధమైన చర్య అని విమర్శించారు. అలాగే ఓయూలో విద్యార్థుల అక్రమ అరెస్టులను (OU Students Arrest) తీవ్రంగా ఖండించారు. నిరసన హక్కు ప్రతి పౌరుడికి ఉన్న ప్రాథమిక హక్కు (Fundumental Right) అన్న సంగతి కాంగ్రెస్ ప్రభుత్వం మరిచి వ్యవహరిస్తున్నదని ఆరోపించారు. విద్యార్థులను అణచివేయడం మాని, వారి సమస్యలు వినాలి, తక్షణం పరిష్కారం చూపాలని, ఆంక్షల ఉత్తర్వులను వెంటనే రద్దు చేయాలని, అరెస్టు చేసిన విద్యార్థులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అంతేగాక తెలంగాణ ఉద్యమ స్పూర్తిని మళ్లీ తుంగలో తొక్కాలనే కుట్ర జరుగుతోందని, విద్యార్థుల, యువత ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడాన్ని బీఆర్ఎస్ ఎప్పటికీ సహించదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే (BRS MLA) వ్యాఖ్యానించారు.



Next Story

Most Viewed