- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Mallu Ravi : ఫేక్ లెటర్లు తయారు చేయించడంలో కేటీఆర్ దిట్ట : మల్లు రవి
కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు.

దిశ, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ ఎంపీ మల్లు రవి(MP Mallu Ravi) బీఆర్ఎస్ నేతలపై ఫైర్ అయ్యారు. సీఎం పేరుతో ఎవరైనా ఫేక్ లెటర్లు(Fake Letters) తయారు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు. మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి(MLA Vakiti Srihari)కి మంత్రి పదవి ఇవ్వొద్దని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) అధిష్టానానికి రాసినట్టు ఓ లెటర్ సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతోంది. అయితే అదంతా అబద్దం అని, రేవంత్ రెడ్డి పేరుతో కావాలని కుట్ర చేస్తున్నారని మల్లు రవి మండిపడ్డారు. సీఎంకు మక్తల్ ఎమ్మెల్యేకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయని, అలాంటప్పుడు రేవంత్ రెడ్డి ఎందుకు అలా చేస్తారని వివరించారు. ఆ ఫేక్ లెటర్ ను కేటీఆర్(KTR) కావాలనే వారి నేతలతో సర్క్యులేట్ చేయిస్తున్నారని, ఇలాంటి ఫేక్ లెటర్లు తయారు చేయడంలో కేటీఆర్ దిట్ట అని ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై తప్పకుండా విచారణ జరిపిస్తామని, తప్పుడు లెటర్లు సృష్టించిన వారిని వదిలేది లేదని, వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ కోసం కాంగ్రెస్ అధిష్టానం కసరత్తులు చేస్తోంది. మంత్రివర్గంలో శ్రీహరి పేరు కూడా ఉందని కాంగ్రెస్ వర్గాల్లో జోరుగా చర్చ నడుస్తోంది. కాగా ఆయనకు మంత్రి పదవి ఇవ్వకూడదు అని సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అధిష్టానానికి రాసినట్టు ఓ లేఖ వైరల్ అవుతుండగా.. మల్లు రవి ఈ వ్యవహారంపై ఘాటుగా స్పందించారు.






