- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలు పట్టించుకోండి: మంత్రి పొన్నం
by Prasad Jukanti |
మంత్రి పొన్నం ప్రభాకర్ తిరుమలలో పర్యటించారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై తిరుమలలో దర్శనాలకు అనుమతి ఇవ్వాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న ఆయన.. నూతనంగా ఏర్పడిన ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. కేంద్రంపై తెలుగు రాష్ట్రాలు ఒత్తిడి తెచ్చి విభజన హామీల అమలుకు కృషి చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ తరహాలోనే తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలపై దర్శనం, వసతి కల్పించేలా అనుమతి ఇవ్వాలని కోరారు. కాగా గతంలో తెలంగాణ ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలపై భక్తులకు దర్శనం, వసతి కల్పించే వారు. ఇటీవల వాటిని తిరుమల అధికారులు పరిగణలోకి తీసుకోవడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పొన్నం ఈ డిమాండ్ చేశారు.
Next Story






