మళ్ళీ దొరికిన కాంగ్రెస్ దద్దమ్మలు.. కాంగ్రెస్ ట్వీట్ కు బీఆర్ఎస్ కౌంటర్

by Ramesh Goud |   (  Updated:2025-03-10 15:56:06  IST  )

మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలే అని చెప్పుకునే దద్దమ్మ కాంగ్రెస్ (Congress)! అని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆరోపించింది.

మళ్ళీ దొరికిన కాంగ్రెస్ దద్దమ్మలు.. కాంగ్రెస్ ట్వీట్ కు బీఆర్ఎస్ కౌంటర్
X

దిశ, వెబ్ డెస్క్: మందికి పుట్టిన బిడ్డలను మా బిడ్డలే అని చెప్పుకునే దద్దమ్మ కాంగ్రెస్ (Congress)! అని బీఆర్ఎస్ పార్టీ (BRS Party) ఆరోపించింది. ఇంటర్నేషనల్ స్ట్రాండర్స్ (International Standards).. మన ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ (Our Integrated Schools) అని తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) చేసిన ట్వీట్ (Tweet) కు స్పందిస్తూ.. కాంగ్రెస్ పార్టీ (Congress Party)పై విమర్శలు (Criticised) చేసింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అవుతూ.. ఆసక్తికర వీడియోను (Intresting Video) పోస్ట్ (Post) చేసింది. ఈ వీడియోలో 2023లో వచ్చిన ఒరిజినల్ కేసీఆర్ వీడియో (Original KCR Video).. 2025 లో వచ్చిన డుప్లీకేట్ రేవంత్ వీడియో (Duplicate Revath Video) అంటూ రాసుకొచ్చింది.

ఇక దీనిపై గత 15 నెలల కాలంలో చేసిన అభివృద్ది ఏమీలేక కేసీఆర్ (KCR) చేసిన అభివృద్దిని తన ఘనతగా చెప్పుకోబోయి రెడ్‌హ్యాండెడ్‌గా (Red Handed) దొరికిపోయిన రేవంత్ (Revanth)! అని వ్యాఖ్యానించింది. అంతేగాక విద్యారంగంలో ఏదో పీకేసామని కాంగ్రెస్ చేసిన బాకా యాడ్ విజువల్స్‌లో (Ad Visuals) కేసీఆర్ హయాంలో చేసిన అభివృద్ధి (Development) తాలూకా విజువల్స్ కాపీ (Cpoy) చేశారని చెప్పింది. అందులో కేసీఆర్ ఫోటో (KCR Photo) కూడా స్పష్టంగా కనిపిస్తున్నా.. అలాగే వాడేసి మళ్ళీ దొరికిన కాంగ్రెస్ దద్దమ్మలు అని సంచలన వ్యాఖ్యలు చేసింది. కాగా కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) ఏర్పాటు చేయబోతున్న ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ ప్రచార వీడియోను తెలంగాణ కాంగ్రెస్ తన ట్విట్టర్ (Twitter) ఖాతాలో పోస్ట్ చేసింది.

Next Story