- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
‘జూబ్లీహిల్స్’ బైపోల్‌పై కాంగ్రెస్ కరసత్తు..! ఇంచార్జీల లిస్ట్ రెడీ
జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌పై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే దృష్టి సారించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: జూబ్లీహిల్స్ బై ఎలక్షన్‌పై కాంగ్రెస్ పార్టీ ఇప్పటి నుంచే దృష్టి సారించింది. నియోజకవర్గంలో పార్టీని యాక్టివ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నది. అందుకోసం ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లను రంగంలోకి దింపేందుకు కసరత్తు మొదలు పెట్టింది. ఎమ్మెల్యేలకు డివిజన్ బాధ్యతలు, చైర్మన్లకు పోలింగ్ బూత్ బాధ్యతలు అప్పగించాలని భావిస్తున్నది. అయితే ఎవరికి, ఎక్కడి బాధ్యతలు అప్పగిచాలనే అంశంపై హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ కసరత్తు పూర్తి చేసినట్లు తెలిసింది. సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తరువాత తుది జాబితాను ప్రకటించి.. సదరు ఇన్ చార్జిలతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి.
పార్టీ బలోపేతంపై దృష్టి
గ్రేటర్ హైదరాబాద్ లో కాంగ్రెస్ చాలా బలహీనంగా ఉందని, పార్టీ కేడర్ ను ముందుకు తీసుకెళ్లేందుకు సమర్థుడైన నాయకుడు లేడనే విమర్శలు ఉన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కష్టమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయాన్ని గ్రహించిన కాంగ్రెస్ అధిష్ఠానం.. నియోజకవర్గంలో పార్టీని స్ట్రెంతెన్ చేయాలని ఆదేశించింది. ఆ బాధ్యతలను ఎమ్మెల్యేలు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ చైర్మన్లకు అప్పగించాలని నిర్ణయించింది. సెగ్మెంట్ పరిధిలో 6 కార్పొరేట్ డివిజన్లు (యూసుఫ్ గూడ, బోరబండ, రహమత్ నగర్, షేక్ పేట, వెంగళరావు నగర్, జూబ్లీహిల్స్) ఉండగా, 360 పోలింగ్ బూత్ లు ఉన్నాయి. అయితే ఒక్కో డివిజన్ కు ఒక ఎమ్మెల్యేను, మూడు, నాలుగు పోలింగ్ బూత్ లకు కలిపి ఒక కార్పొరేషన్ చైర్మన్ ను ఇన్ చార్జిగా అపాయింట్ చేయనున్నారు. అయితే ఎవరిని, ఎక్కడ ఇన్ చార్జిగా నియమించాలనే అంశంపై జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రాథమిక కసరత్తు పూర్తి చేశారు. సీఎం ఢిల్లీ పర్యటన తర్వాత.. జాబితాపై చర్చించి, ఇన్ చార్జిలను అధికారికంగా ప్రకటించి, ఫీల్డ్ లోకి పంపాలని భావిస్తున్నారు.
మూడు నెలలు ఫీల్డ్‌లోనే..
బిహార్ అసెంబ్లీ ఎన్నికలతోపాటే అక్టోబర్ లాస్ట్ వీక్ లేదా నవంబర్ ఫస్ట్ వీక్ లో జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ జరగవచ్చనే చర్చ జరుగుతున్నది. దీంతో షెడ్యూలు వచ్చేలోపే పార్టీని స్థానికంగా స్ట్రెంథెన్ చేసేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తున్నది. అందులో భాగంగా స్థానికం సంస్థల ఎన్నికలు లేని ఎమ్మెల్యేలు, కార్పొరేషన్ చైర్మన్లకు జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ బాధ్యతలు అప్పగించనున్నారు. వీరంతా ఇప్పటి నుంచే ఫీల్డ్ లో పర్యటించి.. పార్టీ కేడర్ ను బలోపేతం చేయనున్నారు. అక్కడ ఉన్న సమస్యలను గుర్తించి, ప్రభుత్వపరంగా పరిష్కరించడంపై ఫోకస్ పెట్టనున్నారు.






