జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోవ‌డం క‌ల్ల.. విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్

by Kema Shiva Kumar |   (  Updated:2025-10-30 06:43:51  IST  )

జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవ‌డం కల్ల అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ ఓడిపోవ‌డం క‌ల్ల.. విప్ ఆది శ్రీనివాస్ హాట్ కామెంట్స్
X

దిశ, వెబ్‌డెస్క్: జూబ్లీహిల్స్ (Jubilee Hills) ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవ‌డం కల్ల అని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ (Aadi Srinivas) అన్నారు. ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తాను ఓడిపోతే ప్రభుత్వం పడిపోతుందని కేటీఆర్ (KTR) గోతికాడ నక్కలా ఎదురుచూస్తున్నాడని కామెంట్ చేశారు. ఆయన మాట్లాడుతున్న మాటలతో కుట్ర, కుతంత్రం అంతా బ‌య‌ట‌ప‌డిందని తెలిపారు. ప‌ద‌వి కోసం ఎంత నీచానికైనా దిగ‌జారుతామ‌ని ఆయ‌నే బ‌హిరంగంగానే చెప్పుతున్నాడని ఎద్దేవా చేశారు. సీఎం కుర్చీలో రేవంత్‌రెడ్డి (Revanth Reddy) కూర్చోవ‌డం జీర్ణించుకోలేక కేటీఆర్ తెగ గింజుకుంటున్నాడని అన్నారు. కాంగ్రెస్ (Congress) అధికారంలోకి వ‌చ్చిన రెండు రోజుల‌కే తమ ప్రభుత్వం కూలిపోతుంద‌ని నీచ‌పు మాట‌లు మాట్లాడిన వ్యక్తి కేటీఆర్ అని ఫైర్ అయ్యారు. వాళ్ల అయ్య కుట్రలు, ఆయన కుతంత్రాలు తెలిసే 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమ ప్రభుత్వానికి మద్దతు తెలిపారని గుర్తు చేశారు.

ఇన్నాళ్లు ఎమ్మెల్యేలు కొట్టిన దెబ్బకు కేటీఆర్ మైండ్ బ్లాంక్ అయి నోరు మూసుకున్నాడని, ఇప్పుడు మళ్లీ జూబ్లీహిల్స్ బై పోల్ వేళ మళ్లీ అవే మాటలు మాట్లాడుతున్నాడని ధ్వజమెత్తారు. జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం కల్లా అని కామెంట్ చేశారు. తమ గెలుపు తర్వాత కేటీఆర్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ పదవి ఉంటుందో.. లేక బంగాళాఖాతంలో క‌లుస్తుందో చూసుకోవాలని హితవు పలికారు. గ‌తంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న నాడు దుబ్బాక, హుజూరాబాద్ ఉప ఎన్నిక‌ల్లో ఓడిపోలేదా అని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్ ఫ‌లితం త‌ర్వాత‌ అస‌లు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ‌లోనే ఉండదన్నారు. ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)లో ఆ పార్టీ ఆఫీసును ఓయో రూమ్‌ల‌ కింద మార్చారంటూ సెటైర్లు వేశారు. తమ అభ్యర్థి నవీన్ యాదవ్‌కు మీద వ్యక్తిగత విమర్శలకు దిగుతున్నారని.. అసలు ఆ పార్టీకి ఎందుకు ఓటు వేయాలని ఆది శ్రీనివాస్ ప్రశ్నించారు.

Next Story