తెలంగాణ ఏర్పాటులో KCR పాత్ర లేదు: జగ్గారెడ్డి

by Disha Web Desk 2 |
తెలంగాణ ఏర్పాటులో KCR పాత్ర లేదు: జగ్గారెడ్డి
X

దిశ, వెబ్‌డెస్క్: బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్‌పై తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం జగ్గారెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కేసీఆర్ ఎక్కడా లేరని అన్నారు. కనీసం నాడు పార్లమెంట్‌లో ఎంపీగా కూడా లేరని గుర్తుచేశారు. తెలంగాణ కోసం పోరాడింది కేవలం కాంగ్రెస్ ఎంపీలే అని అన్నారు. కేవలం తెలంగాణ క్రెడిట్‌ను కేసీఆర్ తన ఖాతాలో వేసుకున్నారని విమర్శించారు.

స్వరాష్ట్రంలో పదేళ్లు అధికారంలో ఉండి రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటు కోసం కేసీఆర్ పార్టీ పెట్టలేదని ఎద్దేవా చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అని అన్నారు. ఇద్దరు కలిసి సమ్మక్క సారలమ్మలనే మోసం చేశారని ఆరోపించారు. ప్రజలను మోసం చేయడం వాళ్లకు తేలిక అని విమర్శించారు. కాంగ్రెస్ ఎంపీ సీట్లకు గండి కొట్టే కుట్రలో బీజేపీ, బీఆర్ఎస్ తీరు ఉందన్నారు. కేంద్ర మంత్రులు ఢిల్లీలో ఉన్నప్పుడు ఒకతీరు.. హైదరాబాద్ వచ్చాకా ఇంకో తీరులో మాట్లాడుతున్నారన్నారు.



Next Story

Most Viewed