Congress: ఆర్టీసీ బస్సుల్లో స్వీట్లు పంచిన కాంగ్రెస్ మహిళా నేతలు.. ఎందుకంటే?

by Ramesh N |
Congress: ఆర్టీసీ బస్సుల్లో స్వీట్లు పంచిన కాంగ్రెస్ మహిళా నేతలు.. ఎందుకంటే?
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ మహిళ కాంగ్రెస్ ఆధ్వర్యంలో ప్రజాపాలన విజయోత్సవాల సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఇవాళ గాంధీభవన్‌లో మహిళ కాంగ్రెస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డికి పాలాభిషేకం చేశారు. అదేవిధంగా గత ఏడాది కాలంగా బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని అమలు చేస్తున్న సందర్భంగా టీపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సునీతారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నేతలు ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు స్వీట్లు పంచారు. కాగా, మహాలక్ష్మీ పథకంలో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకమైన నిర్ణయం తీసుకుని ఏడాది కావొస్తోంది. ఉచిత ప్రయాణంపై ఎన్నో విమర్శలు వచ్చిన క్షేత్ర స్థాయిలో అమలు అవుతూనే ఉన్నది.

Advertisement

Next Story

Most Viewed