- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
దేశాన్ని 48 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ బీసీ గణన ఏనాడు చేపట్టలేదు : ఎంపీ ఈటెల
దేశాన్ని 48 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడు బీసీల గణన చేపట్టలేదని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : దేశాన్ని 48 ఏళ్లు పాలించిన కాంగ్రెస్ ఏనాడు బీసీల గణన చేపట్టలేదని ఎంపీ ఈటెల రాజేందర్ విమర్శించారు. బుధవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అణగారిన వర్గాలకు ఛాంపియన్ అని చెప్పి బీసీ, ఎస్సీ, ఎస్టీల ఓట్లు కొల్లగొట్టారని అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ముసలికన్నీరు కారుస్తుందని ఎద్దేవా చేశారు. బీజేపీ 2014 లో ఒక బీసీ బిడ్డను ప్రధానమంత్రిని చేసిందని, కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను, 12 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలను, 5 మంది మైనారిటీలకు స్థానం కల్పించారు. 60 శాతం మంది ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి గౌరవం ఇచ్చారని పేర్కొన్నారు.
2014 లో ఒక దళిత బిడ్డను, 2021 లో ఆదివాసి అడవి బిడ్డను రాష్ట్రపతులను చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకే దక్కుతుందన్నారు. ముసలి కన్నీరు కార్చే కాంగ్రెస్ కి చెంపపెట్టుగా దేశంలో కులగణన చేపట్టడం హర్షణీయమన్నారు. ఓబీసీలకు గొప్ప గుర్తింపుతో పాటు రాజకీయ, సామాజిక విద్య ,ఉద్యోగాల పరంగా ఓబీసీలకు అవకాశాలు మరింత పెరుగుతాయన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని, ప్రధాని మోడీకి కేంద్ర మంత్రులకు కృతజ్ఞతలు తెలిపారు. బీజేపీ ఒక్కటే అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని ఇది నిరూపించిందన్నారు.
- Tags
- Etala Rajander






