Jubilee Hills: భట్టికి ఇక్కడేం పని?.. అమ్మా ఆపు నీ సెంటిమెంట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య నరాలు తెగే హై టెన్షన్

by Prasad Jukanti |   (  Updated:2025-11-11 10:14:05  IST  )

జూబ్లిహిల్స్ పోలింగ్ సందర్భంగా కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్య రాజకీయం పీక్స్ కు చేరింది.

Jubilee Hills: భట్టికి ఇక్కడేం పని?.. అమ్మా ఆపు నీ సెంటిమెంట్.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య  నరాలు తెగే హై టెన్షన్
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక పోలింగ్ (Jubilee Hills by-election) కొనసాగుతోంది. మధ్యాహ్నం 3 గంట వరకు 40.20 శాతం పోలింగ్ నమోదు అయింది. ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని, బెదిరింపులకు పాల్పడుతున్నారని కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతలు పరస్పరం ఈసీకి (Election Commission complaints) ఫిర్యాదు చేసుకున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఓటర్లను ప్రలోభపెడుతున్నారని, ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ స్థానికేతరులైన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు జూబ్లీహిల్స్ ఓటర్లకు డబ్బులు పంచుతున్నారని దీనిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యే 110-120 పోలింగ్ బూతుల వద్ద స్థానిక ఓటర్లను బెదిరిస్తున్నారని మరికొంత మంది నేతలతో కలిసి బీఆర్ఎస్ కు ఓటు వేయాలని ప్రలోభ పెడుతున్నారని టీపీసీసీ ఎలక్షన్ కమిషన్ కో ఆర్డినేషన్ కమిటీ చైర్మన్ రాజేశ్ కుమార్ ఎస్ఈసీ సుదర్శన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు.

రేపు నా సంగతి చూస్తామంటున్నారు:సునీత

కాంగ్రెస్ అభ్యర్థి మనుషులు జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని రౌడీ రాజ్యంగా మార్చారని, రేపు నీ సంగతి చెప్తానని నవీన్ యాదవ్ మనిషి నన్నే బెదిరించారని బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక రౌడీ షీటర్‌ను ఆంబోతులా బయటకు వదిలేశారని హాట్ కామెంట్స్ చేశారు. బోరబండలోబీఆర్ఎస్ కార్యకర్తలపై దాడి చేశారని ఆరోపించారు. ఇవాళ మీడియాతో మాట్లాడిన సునీత.. జరుగుతున్న తీరును ప్రశ్నిస్తే జైల్లో వేస్తానని పోలీసులే బెదిరిస్తున్నారని తాను అక్కడికి వెళ్లగానే పోలీసులు పారిపోయారని ఆరోపించారు. భట్టి విక్రమార్క, కాంగ్రెస్ ఎమ్మెల్యే, మంత్రులకు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరగాల్సిన అవసరం ఏముదని నిలదీశారు. పోలింగ్ కేంద్రాల వద్ద బీఆర్ఎస్ ఏజెంట్లు కూర్చుంటే వాళ్లని కూర్చొనివ్వడం లేదని పోలీసులు వారి దగ్గర టేబుల్స్, చైర్లు లాక్కొని దౌర్జన్యం చేస్తున్నారని ధ్వజమెత్తారు. వీరిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఎన్నికల సంఘం అధికారులను విజ్ఞప్తి చేశారు.

వీడియోలు వైరల్:

పోలింగ్ వేళ ఇరు పార్టీలలోని ఇతర ప్రాంతాలకు చెందిన నేతలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటించడం సంచలనంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. జూబ్లీహిల్స్ లో ఎన్నికల కోడ్ అమలులో ఉన్నప్పటికీ సిద్ధార్ధ నగర్ బూత్ 120 వద్ద డిప్యూటీ సీఎం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పర్యటించడం కలకలం రేపింది. ఇందుకు సంబంధించిన వీడియోను బీఆర్ఎస్ శ్రేణులు వైరల్ చేస్తున్నాయి. మరో వైపు పోలింగ్ బూత్ నంబర్-121 పరిధిలో వైరా కాంగ్రెస్ ఎమ్మెల్యే రామ్ దాస్ నాయక్ తన అనుచరులతో ఉండటం హాట్ టాపిక్‍గా మారింది. ఎమ్మెల్యేను వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులతో ఆయన అనుచరులు వాగ్వాదానికి దిగారు. మీకు ఇక్కడ ఏం పని అని ప్రశ్నించడంతో ఆయన అక్కడి నుంచి వెళ్లిపోయారు. మరో వైపు కార్వాన్ ఎంఐఎం ఎమ్మెల్యే కౌసర్ మొహియుద్దీన్ తన అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో తిరుగుతున్న వీడియో వైరల్ గా మారింది. కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య రహమత్ నగర్ లోని ఓ పోలింగ్ కేంద్రం వద్ద ఏర్పాటు చేసిన టేబుల్ వద్ద కూర్చోవడం వైరల్ గా మారింది. ఎర్రగడ్డ డివిజన్ లో ఓ వ్యక్తి మాట్లాడుతూ కాంగ్రెస్ కు ఓటు వేయకపోతే పెన్షన్ ఆపేస్తామని మా అమ్మను బెదిరించి ఓట్లు వేయిస్తున్నారని ఆరోపించిన వీడియో వైరల్ గా మారింది.

Next Story