- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: అసెంబ్లీ మీడియా పాయింట్ మంగళవారం బీఆర్ఎష్, కాంగ్రెస్ నేతలు మాట్లాడారు. బీఆర్ఎస్ దుష్ప్రచారం ఎప్పటికప్పుడు ప్రశ్నిస్తున్నందుకు నా వ్యక్తిత్వాన్ని కించపరిచే విధంగా చేశారని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ తెలిపారు. ఆయనతో పాటు ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఉన్నారు. బీఆర్ఎస్ పాలనలో అవినీతి జరిగింది అని కేటీఆర్ సొంత చెల్లెలు కవిత మాట్లాడితే సమాధానం లేదని విమర్శించారు. కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా పదేపదే అబద్ధాలు మాట్లాడుతున్నారని, మా సంక్షేమ పథకాలను చూసి ఓర్వలేకపోతున్నారని అన్నారు. డిగ్ టీవి పేరుతో సోషల్ మీడియాలో (ఎక్స్) లో నేను పెట్టుకున్న వాచి రోలెక్స్ అని, కోటి రూపాయలు అని ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. దుబాయ్ కేంద్రంగా వాట్సప్ గ్రూపుల ద్వారా ఎన్ని అసత్య ప్రచారాలు చేసినా తెలంగాణ ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. అసెంబ్లీ రూల్స్ కి విరుద్ధంగా నా ఫోటో తీయడంపై స్పీకర్‌కు కంప్లైంట్ చేస్తామని అన్నారు. వాట్సప్ గ్రూప్ లు నడుపుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. బీఆర్ఎస్ పదేళ్ల పాలనలో ఎంతో మానసిక ఇబ్బంది పెట్టినా తట్టుకొని ఇక్కడి వరకు వచ్చానని పేర్కొన్నారు.
ఆది శ్రీనివాస్ పై అసత్య ప్రచారం చేస్తున్నారు..
గతంలో మంత్రి సీతక్కపై కూడా అసత్య ప్రచారాలు చేశారని, ప్రశ్నిస్తున్నందుకు విప్ ఆది శ్రీనివాస్ పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని ప్రభుత్వ విప్ రామచంద్రు నాయక్ తెలిపారు. సొంత చెల్లెలు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా కేటీఆర్ దాట వేస్తున్నారని అన్నారు. కాళేశ్వరం, అంబేద్కర్ విగ్రహం ప్రతి దాంట్లో అవినీతి జరిగింది అని సొంత చెల్లెలు మాట్లాడితే దానికి సమాధానం లేదని ప్రశ్నించారు. ప్రజలను గతంలో బంగారు తెలంగాణ పేరుతో తప్పుదోవ పట్టించి, ఇప్పుడు మళ్ళీ ప్రతిపక్షంలో ఉండి తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. ప్రజలు మిమ్మల్ని బట్టలు ఊడదీసి ఉరికించి తన్నే రోజులు దగ్గరలోనే ఉన్నాయని విమర్శించారు. ఆది శ్రీనివాస్ పెట్టుకున్న వాచ్ ఖరీదు కోటి రూపాయలు అయితే, కేవలం రూ.50 వేలు ఇచ్చి తీసుకోండని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు.
కేటీఆర్ పదేపదే తప్పుదోవ పట్టిస్తున్నారు
గవర్నర్ ప్రసంగాన్ని కేటీఆర్ పదేపదే తప్పుదోవ పట్టిస్తున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ఆరోపించారు. పదేళ్ల కాలంలో ఆర్థిక విధ్వంసం చేశారని అసెంబ్లీలో సబ్జెక్ట్ మాట్లాడండి అని చెప్పిన విప్ ఆది శ్రీనివాస్ ట్రోల్ చేస్తున్నారని తెలిపారు. ఆది శ్రీనివాస్ పెట్టుకున్న వాచ్ ఖరీదు కోటి రూపాయలు అని కేటీఆర్ ఆరోపణలు చేస్తున్నారని అన్నారు కోటి రూపాయల ఖరీదు చేస్తే మీరు 30 వేలు ఇచ్చి తీసుకోవాలని కేటీఆర్‌ను ఉద్దేశించి అన్నారు. ఆత్మ గౌరవం, ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టవద్దు అని, ఆది శ్రీనివాస్ మీద చేసిన తప్పుడు ఆరోపణలు వెనక్కి తీసుకుని కేటీఆర్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారు..
కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని వర్ధన్నపేట ఎమ్మెల్యే కె ఆర్ నాగరాజు తెలిపారు. పాడి కౌశిక్ రెడ్డి పోలీసుల మనోస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడుతున్నారు. డ్రగ్స్ కు అలవాటు పడ్డ ముఠా బ్యాచ్ కాబట్టి అసెంబ్లీలో కూడా అహంకారం ప్రదర్శిస్తున్నారని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి ఏకవచనంతో పోలీసు అధికారులను హెచ్చరిస్తున్నారని, గుండాయిజంతో ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు.
బీఆర్ఎస్ నేతలు బురదజల్లే ప్రయత్నం
గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెల్పకుండా, లేని అంశాలు మాట్లాడుతూ బీఆర్ఎస్ నేతలు ఒక ఎజెండాతో ప్రభుత్వం మీద బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ ఆరోపించారు. కేవలం కాంగ్రెస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోయడమే బీఆర్ఎస్ నేతలు లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. డ్రగ్స్ పార్టీలో బీఆర్ఎస్ నేతలు దొరికితే వారిని ఇప్పటివరకు పార్టీ నుంచి సస్పెండ్ చేయలేదని, బిఆర్ఎస్ నాయకులు వైట్ చాలెంజ్ కు సిద్ధమా..? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్‌కు మారి ఇప్పుడు వారి పార్టీ డీఆర్ఎస్‌గా డ్రగ్స్ రాష్ట్ర సమితిగా మారిందని విమర్శించారు. అసెంబ్లీ ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహం ఆవిష్కరణకు కేసీఆర్ రాలేదని, ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో చర్చకు రారా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకత్వలేమితో కొట్టుమిట్టాడుతున్నదని అన్నారు. అసెంబ్లీలో డ్రగ్ టెస్టింగ్ సెంటర్ ఏర్పాటు చేయాలని సీఎంకి విజ్ఞప్తి చేస్తానన్నారు. పార్టీలో కష్టపడి పని చేసే వారికి ఎప్పుడు నష్టం జరగదని, పదవి ఇవ్వడంలో కొంత ఆలస్యం కావచ్చు కానీ, ప్రాధాన్యత ఇవ్వకపోవడం ఉండదన్నారు.
కరీంనగర్ సీపీ ఇల్లీగల్ పనులు
కరీంనగర్ సీపీ ఆలం గౌస్ తనకున్న పవర్ ను ఉపయోగించి ఇల్లీగల్ పనులు చేస్తున్నాడని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి ఆరోపించారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడుతూ.. సీపీకి జల్సాలు ఎక్కువ అయ్యాయని, తన కుటుంబ సభ్యులతో కలిసి బోనాల పల్లి గ్రామంలో ఇష్టానుసారంగా ఫైరింగ్ చేస్తున్నారని అన్నారు. సీపీ చేసిన ఫైరింగ్ లో అమృతమ్మ అనే వృద్ధురాలు తొడకు గాయమైందని, మరుసటి రోజు కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి వివేక్ వెంకటస్వామి పత్రికలో వార్త వచ్చిందన్నారు. కరీంనగర్ సీపీ ఆలం గౌస్ తన సతీమణి, ఫ్రెండ్స్ కలిసి ఇష్టం వచ్చినట్లు ఫైరింగ్ చేస్తున్నారని ఆరోపించారు.180 బుల్లెట్లు ఫైరింగ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయన్నారు. సీపీపై సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదో తెలపాలన్నారు. సీఎం ఆదేశాల మేరకే సీఐడీ అధికారులు తనపై కేసు పెట్టారని వెల్లడించారు. ఒక్కరిద్దరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల వ్యవహార శైలి వల్ల అందరికీ చెడ్డ పేరు వస్తుందన్నారు. టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ ఇచ్చి పారిపోవడం కాదు, అసెంబ్లీలో డ్రగ్ టెస్ట్ పెట్టాలన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది డ్రగ్స్ తీసుకుంటున్నారో అప్పుడు తెలుస్తుందన్నారు
గ్రామాల్లో ముఖం చూపెట్టుకోలేకపోతున్నారు..
సీఎం రేవంత్ రెడ్డి చేస్తున్న పనుల వల్ల ఎమ్మెల్యేలు గ్రామాల్లో ముఖం చూపెట్టుకోలేకపోతున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కెపి వివేకానంద, డా సంజయ్ ఆరోపణలు చేశారు. అత్యంత విఫల ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారని తెలిపారు. 99 రోజులు ప్రజాపాలన 9 రోజులుకే బొక్క బోర్ల పడిందన్నారు. నిధులు లేవు, విధులు లేవు 99 రోజుల పాలన అట్టర్ ప్లాప్ అని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండున్నర సంవత్సరాలు కాలం అయింది.. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే ధోరణితో ఉన్నారని ఆరోపించారు. ఢిల్లీకి మూటలు మోయడంతో సీఎంకు సరిపోతుందన్నారు. విశ్వాసం కోల్పోయిన ఎమ్మెల్యేలు తమ దారి తాము చూసుకుంటున్నారన్నారు. యాసంగికి రైతు భరోసా ఇవ్వలేదన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు లేక రైతులు రావాల్సిన ధరలో 35 శాతం నష్టపోతున్నారని పేర్కొన్నారు. కరెంటు లేదు, పెట్టుబడి లేదని పేర్కొన్నారు. ప్రెసెంట్ ని నాశనం పట్టించి ఫ్యూచర్ గురించి సీఎం ఆలోచన చేస్తున్నారని అన్నారు. రైతులు చాలా నష్టపోతున్నారని, వ్యవసాయ శాఖ మంత్రి కళ్ళు తెరవాలన్నారు.






