- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- ప్రపంచం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- కెరీర్
- ఆరోగ్యం
- భక్తి
- రాశి ఫలాలు
- టెక్నాలజీ
- సాహిత్యం
- ఫొటో గ్యాలరీ
- గాసిప్స్
- వైరల్
- సెక్స్ & సైన్స్
- వ్యవసాయం
- Bigg Boss Telugu 8
Job Calendar 2024: జాబ్ క్యాలెండర్‌పై బీఆర్ఎస్ మోకాలు అడ్డు.. కాంగ్రెస్ ఆసక్తికర ట్వీట్
దశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్‌లో ఉద్యోగాల సంఖ్య ప్రకటించకుండా నిరుద్యోగులను మోసం చేశారని గన్‌పార్క్ వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు నిరసన తెలిపారు. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధికార ట్విట్టర్ వేదికగా స్పందించింది. కేసీఆర్.. నాడు యువత నడ్డి విరిచి ఉద్యోగాలు భర్తీ చేయకుండా నాటకాలు ఆడారని విమర్శించింది. నేడు ప్రజా ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ విడుదల చేసి ఉద్యోగాలు భర్తీ చేస్తామంటే మోకాలు అడ్డు పెడుతున్నారని ఆరోపించింది.
తెలంగాణ యువతను రాజకీయాలకు ఎలా వాడుకోవాలో, వారి జీవితాలను నాశనం చేసి, నీ కాల్మోక్త బాంచన్ అంటూ దొరల దగ్గర బానిసలుగా ఎలా బ్రతకాలో పక్కా ప్రణాళికలు బీఆర్ఎస్ రచించిందని వెల్లడించింది. తెలంగాణ యువత మేలుకుని, కేసీఆర్ కుట్రలను ఛేదించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిందని పేర్కొంది. ఒక్క గ్రూప్ 1 ఉద్యోగం భర్తీ చేయకుండా, ఒక్క ఉపాధ్యాయ పోస్ట్ భర్తీ చేయకుండా ప్రభుత్వాన్ని నడిపి, వేసిన నోటిఫికేషన్ల ప్రశ్న పత్రాలు అమ్ముకొని, నిరుద్యోగుల ఆశలపై నిప్పు పెట్టిందని ఆరోపించింది.
ఒక దశాబ్దపు యవ్వనాన్ని నాశనం చేసి వారి కుటుంబాలను ఛిద్రం చేసిందని పేర్కొంది. బీఆర్ఎస్ నీచమైన రాజకీయ ఆలోచనలు పసిగట్టిన తెలంగాణ మీకు ఒక్క ఎంపీ సీటు కూడా ఇవ్వకుండా సమాధానం చెప్పిందని పేర్కొంది. ఇకనైనా బుద్ధి తెచ్చుకుని, అహంకారం, దొరతనం పక్కన పెట్టి, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వామ్యం అవ్వండని, మీరు చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం చేసుకోండని కోరింది.