విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలించుడు పక్కా! బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్

by Ramesh Naini |

కాంగ్రెస్ సర్కార్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది.

విగ్రహాన్ని గాంధీ భవన్‌కు తరలించుడు పక్కా! బీఆర్ఎస్ ఆసక్తికర ట్వీట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: కాంగ్రెస్ సర్కార్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి విగ్రహంపై బీఆర్ఎస్ తీవ్ర విమర్శలు గుప్పించింది. ఈ మేరకు మంగళవారం ఎక్స్ వేదికగా బీఆర్ఎస్ పార్టీ అధికారిక ఖాతా ఆసక్తికర పోస్ట్ చేసింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఆవిష్కరించిన తెలంగాణ తల్లి ఫోటోలను షేర్ చేసింది. తెలంగాణ తల్లి.. ఉద్యమ భావోద్వేగాల మధ్య, పోరాట స్ఫూర్తితో పుట్టిన రూపం అని, తెలంగాణ బిడ్డలంతా స్వచ్ఛందంగా ఊరూరా, వాడవాడలా విగ్రహాలు పెట్టుకుని పూజించుకున్నామని తెలిపింది.

ఇప్పుడు మార్పు.. మార్పు అంటూ తల్లి చేతిలో నుంచి మన సంస్కృతికి ప్రతీకైన బతుకమ్మను తీసేసి, ఉద్యమానికి ఏమాత్రం సంబంధం లేని కాంగ్రెస్ తల్లిని సృష్టించి ఆ విగ్రహాలను ఏర్పాటు చేస్తున్న దుర్మార్గుడు రేవంత్.. బీఆర్ఎస్ తీవ్రంగా విమర్శించింది. తల్లి రూపాన్నే మార్చిన చరిత్రహీనుడిగా రేవంత్ మిగిలిపోవడం ఖాయం! అని, మళ్లీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే.. ఈ కాంగ్రెస్ తల్లి విగ్రహాలను గాంధీ భవన్‌కు తరలించుడు పక్కా అని ట్వీట్‌లో బీఆర్ఎస్ పేర్కొంది. ట్వీట్ ఇదే..

Next Story