- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఆర్ఎస్ఎస్ ను కాంగ్రెస్ టార్గెట్ చేయడం దారుణం : కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
కాంగ్రెస్ పార్టీ మరోసారి తన బుద్ధిని బయటపెట్టిందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు.

దిశ, తెలంగాణ బ్యూరో : కాంగ్రెస్ పార్టీ మరోసారి దేశ వ్యతిరేకతను బయటపెట్టుకుని దేశాన్ని కాపాడుతున్న రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్, రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సంస్థలను టార్గెట్ చేయడం దుర్మార్గానికి పరాకాష్టగా ఉందని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంటూ అమెరికా కమిషన్ ఆన్ ఇంటర్నేషనల్ రిలీజియస్ ఫ్రీడమ్ అనే సంస్థ ఇచ్చిన నివేదికను తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. చాలా ఏళ్లుగా భారత్‌పై ద్వేషభావంతో అసంబద్ధమైన కథనాలపై ఆధారపడి ఏకపక్షంగా, భావజాలపరంగా నివేదికలు ఇస్తూ భారత్ గురించి తప్పుడు ప్రచారం చేస్తోందని ఇప్పటికే భారత విదేశాంగ శాఖ తప్పుపట్టింది. భారత్‌పై ఏకపక్షంగా అబద్ధపు విమర్శలు చేయడం పక్కన పెట్టి, అమెరికాలో హిందూ దేవాలయాలపై జరుగుతున్న దాడులు, భారత్ లక్ష్యంగా కొన్ని సంస్థలు దుష్ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అమెరికాలో ఉంటున్న భారతీయులకు బెదిరింపులు పెరుగుతున్న వివక్షను ఏమాత్రం పట్టించుకోని విదేశీ సంస్థలు ఒక పథకంగా భారతదేశంపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయి. గత కొన్నేళ్లుగా రాహుల్ గాంధీ నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా దేశ వ్యతిరే శక్తులకు కేంద్రంగా మారింది. పశ్చిమాసియాలో జరుగుతున్న గందరగోళ పరిస్థితుల్లో కూడా గ్యాస్విషయంలో తప్పుడు పుకార్లు సృష్టించే ప్రయత్నం చేసింది. రా’ వంటి సంస్థ భారత్‌ను ఉగ్రవాదం వంటి ముప్పు నుంచి కాపాడేందుకు ఎల్లప్పుడూ పనిచేస్తుంది. ఆర్ఎస్ఎస్ సామాజిక-సాంస్కృతిక సంస్థగా దేశ ఐక్యత, దేశ సమగ్రత కోసం పనిచేస్తుంటుంది. ఇలాంటి సంస్థలను బలహీనపరచాలని కాంగ్రెస్ పార్టీ కోరడంలో ఆంతర్యమేంటో వారికే తెలియాలి. కాంగ్రెస్ పార్టీ దేశ వ్యతిరేక వైఖరిని అన్ని వర్గాల ప్రజలు తీవ్రంగా ఖండించాలని విజ్ఞప్తి చేశారు.






