- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పురుమళ్ల శ్రీనివాస్‌పై వేటు..కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్
కరీనంగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పురుమళ్ల శ్రీనివాస్‌పై పార్టీ వేటు వేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో : కరీనంగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి పురుమళ్ల శ్రీనివాస్‌పై పార్టీ వేటు వేసింది. కొంతకాలంగా పార్టీ నిబంధనలకు విరుద్ధంగా శ్రీనివాస్ వ్యవహరిస్తూ సొంత పార్టీ నేతలపైనే అనుచిత వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఈమేరకు ఆయనపై ఫిర్యాదులు అందాయి. అలాగే ఇటీవల గాంధీ భవన్‌కు చేరుకున్న నియోజకవర్గ నాయకులు ఆయన్ను సస్పెండ్‌చేయాలని ఏకంగా టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్‌ను కలిసి వినతి పత్రం అందజేశారు. అలాగే, ఆయన చేస్తున్నటువంటి పార్టీ వ్యతిరేక కార్యకలాపాలపై టీపీసీసీ ఛీప్‌కు వివరించారు.
పురుమళ్ల శ్రీనివాస్ వ్యవహార తీరుపై టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ ఈఏడాది జనవరిలోనే షోకాజ్‌నోటీసు అందజేసి, వివరణ ఇవ్వాలని కోరింది. దీంతో ఆయన టీపీసీసీకి క్రమశిక్షణా చర్య కమిటీ అందజేసిన వివరణతో సంతృప్తి చెందలేదని, కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయాలని నిర్ణయం తీసుకున్నామని ఆ కమిటీ చైర్మన్ చిన్నారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం విడుదల చేసిన ప్రకటనలో పురుమళ్ల శ్రీనివాస్ కాంగ్రెస్ లో సొంత నాయకులతో ప్రవర్తను మార్చుకోవాలని, పార్టీ తగినంత సమయం ఇచ్చిందని తెలిపారు. కానీ అతని వైఖరిలో ఎలాంటి మార్పు లేకపోవడంతోపాటుగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతుండడంతో పార్టీ నుంచి సస్పెండ్ చేశామని, వెంటనే ఉత్తర్వులు అమల్లోకి వస్తాయని క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ డాక్టర్ చిన్నారెడ్డి తెలిపారు.






