కాంగ్రెస్ అంటేనే కరప్షన్.. మంత్రి కుటుంబ ఆరోపణలతో మరోసారి నిజమైంది: బీజేపీ చీఫ్

by Malleboina Mahesh |   (  Updated:2025-10-16 08:24:53  IST  )

తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం గా మారిన మంత్రి కొండా సురేఖ కుటుంబ ఆరోపణలపై బీజేపీ చీఫ్ రాంచందర్ రావు స్పందించారు.

కాంగ్రెస్ అంటేనే కరప్షన్.. మంత్రి కుటుంబ ఆరోపణలతో మరోసారి నిజమైంది: బీజేపీ చీఫ్
X

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం గా మారిన మంత్రి కొండా సురేఖ కుటుంబ ఆరోపణలపై బీజేపీ చీఫ్ రాంచందర్ రావు (BJP chief Ramchandra Rao) స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) అంటేనే కరప్షన్ అని.. మంత్రి కుటుంబ ఆరోపణలతో మరోసారి రుజవైందని రాంచందర్ రావు అన్నారు. సీఎం రేవంత్ రెడ్డి పై చేసిన ఆరోపణలకు.. తప్పక వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందని, కొండా సుస్మిత (Konda Sushmita) వ్యాఖ్యలపై విచారణ జరగాలని ఈ సందర్భంగా ఆయన డిమాండ్ చేశారు. అలాగే డెక్కన్ సిమెంట్స్ ప్రతినిధులను బెదిరించిన వారి వెను ఎవరున్నారో బయట పెట్టాల్సిందేనని, ఇలా దోచుకునే నేతలు ఎక్కువ రోజులు ఉండొద్దని, తుపాకులతో కాంగ్రెస్ నేతలు బెదిరింపులకు దిగుతున్నారని, కాంగ్రెస్ నేతల ఆస్తుల వివరాలు బయట పెట్టాలని ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ చీఫ్ రాంచందర్ రావు డిమాండ్ చేశారు.

Next Story