Jubilee Hills: జూబ్లీహిల్స్ లో మద్దతు ఇవ్వండి.. టీజేఎస్‍కు కాంగ్రెస్ లేఖ

by Prasad Jukanti |   (  Updated:2025-10-21 12:17:34  IST  )

జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ ను గెలిపించాల్సిన అవసరం ఉందని కోదండరాంకు మహేశ్ కుమార్ లేఖ రాశారు.

Jubilee Hills: జూబ్లీహిల్స్ లో మద్దతు ఇవ్వండి..  టీజేఎస్‍కు  కాంగ్రెస్ లేఖ
X

దిశ, డైనమిక్ బ్యూరో: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక (Jubilee Hills by-election) రసవత్తరంగా మారింది. నామినేషన్ల పర్వం ముగియడంతో ప్రధాన పార్టీలన్ని ప్రచారంపై ఫోకస్ పెట్టాయి. అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ ఈ బై ఎలక్షన్‍ను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. రాజకీయ అవసరాల దృష్ట్యా ఈ స్థానంలో గెలవడానికి అన్ని పార్టీలు వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక ఈ స్థానంలో గెలవడం ద్వారా ప్రభుత్వ పనితీరుపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలకు చెక్ పెట్టాలని హస్తం పార్టీ స్కెచ్ వేస్తోంది. అందులో భాగంగా గెలుపు కోసం కలిసి వచ్చే ఏ అవకాశాన్ని కూడా వదులుకునేందుకు ఇష్టపడటం లేదు.

టీజేఎస్ మద్దతు కోరిన పీసీసీ చీఫ్:

జూబ్లీహిల్స్ అసెంబ్లీలో కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ కు మద్దతు ఇవ్వాలని తాజాగా టీపీసీసీ చీఫ్ తెలంగాణ జనసమితిని కోరారు. ఈ మేరకు ఇవాళ టీజేఎస్ (TJS Kodandaram) చీఫ్, మాజీ ఎమ్మెల్సీ కోదండరాం కు మహేశ్ కుమార్ గౌడ్ (Mahesh kumar goud) లేఖ రాశారు. గత బీఆర్ఎస్ పాలనలో కేసీఆర్ ఎంతటి విధ్వంసానికి పాల్పడ్డారో మీకు బాగా తెలుసు. ఉద్యమకారుడు, టీజేఎస్ అధ్యక్షుడిగా ఉన్న మిమ్నల్నీ ఒక ఉగ్రవాది మాదిరిగా అరెస్టు చేసిన ఉదంతాలు తెలంగాణ సమాజం ఇంకా మరిచిపోలేదని లేఖలో మహేశ్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. టీఆర్ఎస్ బీఆర్ఎస్‍గా పేరు మార్చుకుని తెలంగాణతో ఉన్న పేగు బంధాన్ని తెంపుకుందని పార్టీ పేరులో తెలంగాణ పేరు లేకుండా కేటీఆర్ తన తెలంగాణ వ్యతిరేకతను ప్రదర్శించుకున్నారని ఆరోపించారు. గత 22 నెలలు రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రజా పాలన రాష్ట్ర ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తోందని ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేస్తూ అన్ని వర్గాల సంక్షేమానికి కృషి చేస్తోందన్నారు. ఇలాంటి తరుణంలో వచ్చిన జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నికలు అత్యంత కీలకమైనవని ఈ సమయంలో బీఆర్ఎస్ ను ఓడించి కాంగ్రెస్ పార్టీని గెలిపించడం మన అందరి బాధ్యత అని రాశారు. అందుకోసం మీ వంతు సంపూర్ణ సహకారం అందించాలని కోరారు. కాగా జూబ్లీహిల్స్ బై పోల్‍లో ఇప్పటికే ఎంఐఎం, సీపీఐ, సీపీఎం పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇచ్చిన విషయం తెలిసిందే.

Next Story