Congress: సోషల్ మీడియా పోల్ పెట్టిన చిచ్చు.. కాంగ్రెస్‌లో తొలి వికెట్ డౌన్!

by Kema Shiva Kumar |

తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ సోషల్ మీడియా (Social Media)లో చేపట్టిన పోల్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది.

Congress: సోషల్ మీడియా పోల్ పెట్టిన చిచ్చు.. కాంగ్రెస్‌లో తొలి వికెట్ డౌన్!
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) పార్టీ సోషల్ మీడియా (Social Media)లో చేపట్టిన పోల్ రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే, పోల్‌లో వచ్చిన ఫలితంతో కంగుతిన్న హస్తం పార్టీ పెద్దలు డిఫెన్స్ పడినట్లుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్, టీఎస్టీఎస్ చైర్మన్ రెండు పదవుల నుంచి మన్నే సతీష్ కుమార్‌ (Sathish Kumar)ను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లుగా సమాచారం. అయితే, మన్నే సతీష్ స్థానంలో నల్లగొండ జిల్లాకు చెందిన గుత్తా అమిత్ రెడ్డి (Gutta Amit Reddy) లేదా పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ (MP Vamsi Krishna) ను నియమించే అవకాశాలు ఉన్నాయని ప్రాథమికంగా తెలుస్తోంది. కాగా, గత బీఆర్ఎస్ (BRS) పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) అధికారిక ‘ఎక్స్’(ట్విటర్) హ్యాండిల్‌లో జనవరి 29న పోల్ సర్వే చేపట్టారు.

కానీ, అనూహ్యంగా కాంగ్రెస్ పాలనకు వ్యతరేకంగా నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున ఓట్లు రావడం చర్చనీయాంశంగా మారింది. అయితే, వారు చేసిన పోస్ట్‌లో ఇందులో తెలంగాణ (Telangana) రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి పాలన కోరుకుంటున్నారు..? అనే ప్రశ్నను నెటిజన్లకు వేశారు. ఆ ప్రశ్న కింద A. ఫామ్ హౌస్ పాలన, B. ప్రజల వద్దకు పాలన ఆప్షన్లను ఇచ్చారు. ఆ రెండు సమాధానాల్లో పరోక్షంగా ‘ఫామ్ హౌస్ పాలన’ అంటే బీఆర్ఎస్ పాలన కావాలా..? లేక ‘ప్రజలకు వద్దకు పాలన’ అంటే కాంగ్రెస్ పాలన కావాలా..? అని తెలంగాణ కాంగ్రెస్ పార్టీ తరఫున అడిగినట్లుగా ఉంది. సర్వేలో మొత్తం 92,551 మంది నెటిజన్లు పాల్గొన్నారు. ఈ పోల్‌లో పాల్గొన్న వారిలో 67 శాతం మంది ఆప్షన్ ‘A’కి అనుకూలంగా ఓట్లు వేయగా, 33 శాతం మంది ‘B’ని ఎంచుకున్నారు. కాంగ్రెస్ పెట్టిన పోల్‌లో కాంగ్రెస్ పాలనకు వ్యతిరేకంగా ఎక్కువగా ఓట్లు రావడంతో, ఇప్పుడు ఆ వ్యవహారం తెలంగాణ రాజకీయాల్లో చర్చకు దారి తీసింది. ‘కాంగ్రెస్ పార్టీ (Congress Party) ఆన్‌లైన్ సర్వే చేపట్టి సెల్ఫ్ గోల్ వేసుకున్నట్లు అయ్యింది’ అంటూ కొందరు నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో కాంగ్రెస్ సోషల్ మీడియా చైర్మన్, టీఎస్టీఎస్ చైర్మన్ రెండు పదవుల నుంచి మన్నే సతీష్ కుమార్‌ను తొలగించాలని కాంగ్రెస్ అధిష్టానం నుంచి ఆదేశాలు అందినట్లుగా తెలుస్తోంది.

Next Story