Eatala Rajender: రేవంత్ రెడ్డి పరువు పోతుందని కాంగ్రెస్ పార్టీనే లగచర్లలో దాడికి స్కెచ్: ఈటల

by Prasad Jukanti |   (  Updated:2024-11-18 07:48:39  IST  )

సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల ఘటన బాధితులను బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ ములాఖత్ అయ్యారు.

Eatala Rajender: రేవంత్ రెడ్డి పరువు పోతుందని కాంగ్రెస్ పార్టీనే లగచర్లలో దాడికి  స్కెచ్: ఈటల
X

దిశ, డైనమిక్ బ్యూరో: లగచర్ల బాధితులకు ప్రభుత్వం భేషరతుగా క్షమాపణలు చెప్పి వారిని వెంటనే విడుదల చేయాలని బీజేపీఎంపీ ఈటల రాజేందర్ (Eatala Rajender) డిమాండ్ చేశారు. బాధితులపై థర్ట్ డిగ్రీ ప్రయోగించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ వారే స్కెచ్ వేసి దాడులు చేశారని ఆరోపించారు. లగచర్ల ఘటనలో అరెస్టు అయిన 16 మంది లగచర్ల బాధితులను సోమవారం సంగారెడ్డి సెంట్రల్ జైల్లో (Sangareddy Central Jail) బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్, డీకే అరుణ (DK Aruna) తో పాటు ఐదుగురు బీజేపీ (BJP) నేతలు ములాఖత్ అయ్యారు. దాడి ఘటనలో ఏం జరిగిందో అడిగి తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటల.. వందల మంది పోలీసులతో దుర్మార్గంగా ప్రజలను భయభ్రాంతులను గురి చేయడమే కాకుండా గొడ్డును కొట్టినట్లుగా కొట్టారని ఆరోపించారు. కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్లుగా వెనుకబడిన కొడంగల్ ను అభివృద్ధి చేస్తారనుని రేవంత్ రెడ్డికి ఓట్లేస్తే తరతరాలుగా సాగు చేసుకుంటున్న తమ భూములను లాక్కుంటున్నారని ధ్వజమెత్తారు. తమ భూములు ఇవ్వమని ప్రజాస్వామిక పద్దతుల్లో నిరసన తెరుపుతుంటే సీఎం తలపెట్టిన ప్రాజెక్టు ఆగిపోతే రేవంత్ రెడ్డి పరువు పోతుందని కాంగ్రెస్ వాళ్లే కుట్రపూరితంగా దాడులు చేశారని, దాడులను అడ్డం పెట్టుకుని స్థానికులను భయపెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Next Story