- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG News : బీసీలకు కాంగ్రెస్ ఎన్ని సీట్లు ఇచ్చిందో చెప్పాలి : ఎమ్మెల్యే పాయల్ శంకర్
బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు.

దిశ, వెబ్ డెస్క్/ఆదిలాబాద్ : ఆదిలాబాద్ బీజేపీ ఎమ్మెల్యే పాయల్ శంకర్(MLA Payal Shankar) తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు.. కాంగ్రెస్ బీసీలకు అన్యాయం చేస్తోందంటూ మండిపడ్డారు. బీసీలకు ఎన్ని పదవులు ఇచ్చిందో బహిరంగంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం బీసీ సంఘాలను మోసం చేస్తూ, వారి అవసరాలను పట్టించుకోలేదని విమర్శించారు. ఎన్నికల ముందు కామారెడ్డి డిక్లరేషన్‌లో బీసీలకు 42% రిజర్వేషన్ హామీ ఇచ్చి, తూతూ మంత్రంగా సర్వే జరిపి చేతులు దులుపుకుందని మండిపడ్డారు. కేంద్రంలో కాంగ్రెస్ ఎప్పటికీ అధికారంలోకి రాదని తెలిపిన పాయల్ శంకర్.. దేశ ప్రజలు కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదని అన్నారు. కాంగ్రెస్ సామాజిక న్యాయం ఎన్నటికీ చేయలేదని తెలిపారు. కేవలం తెలంగాణను దోచుకునేందుకు, ఢిల్లీకి మూటలు పంపడానికే కాంగ్రెస్ వాడుకుటుందని మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ మోసం చేసినంత ఏ పార్టీ ప్రజలను మోసం చేయలేదని,బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదని పాయల్ శంకర్ పేర్కొన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు నియామకంపై టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. బీసీలను అవమానించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు. బీసీ వాదాన్ని బలంగా వినిపించేది కేవలం బీజేపీనే మాత్రమే అని స్పష్టం చేశారు.ఈ సమావేశంలో నాయకులు ఆకుల ప్రవీణ్, ఉష్కం రఘుపతి,లాలామున్న జోగురవి,కృష్ణ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.






