- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కన్నీరు పెట్టిన కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్ రెడ్డి
మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు.

దిశ, వెబ్‌డెస్క్: మున్సిపల్ ఎన్నికల ప్రచారం(Municipal Election Campaign)లో కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్‌రెడ్డి(Jeevan Reddy) భావోద్వేగానికి లోనయ్యారు. శుక్రవారం కార్యకర్తలతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో తన వాళ్లకు టికెట్లు ఇవ్వలేదని ఆవేదన చెందారు. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టమన్నారు.. సీఎం అయ్యాక ఇప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేలకే ప్రాధాన్యత ఇస్తున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. రేవంత్ రెడ్డి లాగా రాళ్ల కొట్టడం వద్దని.. ఓట్లతో కొడదామని కాంగ్రెస్ శ్రేణులకు జీవన్ రెడ్డి పిలుపునిచ్చారు. సొంత పార్టీ నేతలే నా గొంతు కోద్దామని చూస్తున్నారని చెప్పారు. నా గొంతు కోయాలంటే ముందు నా కార్యకర్తలను దాటి రావాలని అన్నారు. జీవితం అయిపోయే ముందు నన్ను బాధపెడుతున్నారని జీవన్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు.
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ తన వర్గాన్ని పక్కనపెట్టి.. తనతోపాటు బీఆర్‌ఎస్ పార్టీ నుంచి వచ్చిన వారిని ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. సంజయ్ కుమార్ తాను బీఆర్‌ఎస్ పార్టీలోనే ఉన్నానని చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ జెండా పట్టుకుని ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. బీఆర్‌ఎస్‌లోనే ఉన్నా అంటూ సంజయ్ కాంగ్రెస్ జెండాను ఎత్తుకుపోయాడని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీలో దొంగలు పడ్డారని జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు.






