- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Sarpanch Elections: కోదాడలో ఐదు ఓట్లతో విజయం సాధించిన కాంగ్రెస్ సర్పంచ్..
సూర్యాపేట జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది.

దిశ, డైనమిక్ బ్యూరో: సూర్యాపేట జిల్లా గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాల్లో ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. కోదాడ మండలం కూచిపూడి తండాలో కాంగ్రెస్ మద్దతుదారు విజయం సాధించారు. కేవలం ఐదు ఓట్లతో కాంగ్రెస్ మద్దతుదారు హాజీ నాయక్ విజయం సాధించారు. ఇందుకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. కాగా, తెలంగాణలో రెండో విడత పంచాయతీ ఎన్నికల ఫలితాల కౌంటింగ్ తీవ్ర ఉత్కంఠ భరితంగా కొనసాగుతోంది. ప్రస్తుతం అందిన సమాచారం ప్రకారం, సర్పంచ్ పదవుల గెలుపులో కాంగ్రెస్ పార్టీ దూసుకెళ్తోంది. తాజా సమాచారం ప్రకారం.. కాంగ్రెస్ మద్దతుదారులు అత్యధికంగా 272 సర్పంచ్ పదవులను కైవసం చేసుకున్నారు. అలాగే బీఆర్‌ఎస్ పార్టీ మద్దతుదారులు 32 స్థానాల్లో విజయం సాధించగా, బీజేపీ మద్దతుదారులు 13 స్థానాలను గెలుచుకున్నారు. ఇక ఇతర పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు మద్దతుదారులు కూడా 72 సర్పంచ్ స్థానాలు గెలుచుకున్నారు.
READ MORE ....






