- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BRS MLC Kavitha : తెలంగాణ జలగోసకు కాంగ్రెస్ పాలకులే కారణం: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫైర్
తెలంగాణ తలాపున పారుతున్న కృష్ణా, గోదావరి నదులు మన బీళ్లకు తాకకుండా పోవడానికి 60ఏండ్లకు పైగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పాలకు(Congress Rulers)లే కారణమని బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు.

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ తలాపున పారుతున్న కృష్ణా, గోదావరి నదులు మన బీళ్లకు తాకకుండా పోవడానికి 60ఏండ్లకు పైగా ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన కాంగ్రెస్ పాలకు(Congress Rulers)లే కారణమని బీఆర్ఎస్ ఎమ్మె్ల్సీ కల్వకుంట్ల కవిత విమర్శించారు. తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న "నీళ్లు - నిజాలు" రౌండ్ టేబుల్ సమావేశాన్ని("Water - Truths" Round Table Conference)ఆమె ప్రారంభించి మాట్లాడారు. ఉమ్మడి రాష్ట్రంలో నది జలాల్లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా ఉద్యమించి ప్రత్యేక రాష్ట్రం సాధించుకుని తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దే క్రమంలో తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలన(KCR's Rule)లో ప్రధమ ప్రాధాన్యతగా భారీగా ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టుకోవడం జరిగిందన్నారు.
అనేక మంది ఇంజనీర్లు, మేధావుల మెదళ్లను రంగరించి ఇవ్వాళ చూస్తున్న కోటీ ఎకరాల మాగాణగా రాష్ట్రాన్ని నిర్మించుకోగలిగామన్నారు. ఇంటింటికి నిరంతర తాగునీటీని అందించుకోగలిగామన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 60ఏండ్లలో కేవలం 50లక్షల ఎకరాలకు నీరందిస్తే తెలంగాణ రాష్ట్రంలో పదేళ్లలో కోటీ ఎకరాలకు నీరందిస్తున్నామని. కాలంతో పోటీ పడి వేగంగా ప్రపంచంలోనే అతిపెద్ధ లిఫ్టు ఇరిగేషన్ కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించుకున్నామని. 1కోటీ 24లక్షల ఎకరాలకు సాగునీరందించే ప్రాజెక్టులను చేపట్టి ప్రధాన పనులన్నింటిని పూర్తి చేశామన్నారు. మిషన్ కాకతీయతో 15లక్షల ఎకరాలకు నీరందించుకుంటున్నామని.. చెరువులను బాగు చేసుకోవడం ద్వారా 9.61టీఎంసీ నీటిని ఒడిసి పట్టుకున్నామని, భూగర్భ జలాలను పెంచుకోగలిగామన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో 68లక్షలు టన్నులు వరి పంట పండితే పదేళ్లలో 2022-23లో 1కోటీ 68లక్షల టన్నులకు పెరిగిందని..ఇండియాలోనే రాష్ట్రం నంబర్ వన్ గా ఉందన్నారు. మత్స్య సంపద కూడా 7వేల కోట్ల వరకు కూడా పెరిగిపోయిందన్నారు. అదిలాబాద్ లో తెలంగాణ రాకముందు 1లక్ష 39వేల ఎకరాలైతే 2023నాటికి 8లక్షలు, నిజమాబాద్ లో 4లక్షల నుంచి 10 లక్షలకు, మెదక్ లో రెండన్నర లక్షల నుంచి 8లక్షలకు, కరీంనగర్ లో 4లక్షల నుంచి 12లక్షల 61వేల ఎకరాలకు, వరంగల్ లో 4.48లక్షల నుంచి 9లక్షలకు, ఖమ్మంలో రెండున్నర లక్షల నుంచి 4లక్షల ఎకరాలకు, నల్లగొండలో ఏడున్నర లక్షల నుంచి 13.42లక్షలకు, మహబూబ్ నగర్ లో 2.23లక్షల నుంచి 9.58లక్షలకు, రంగారెడ్డి జిల్లాటో 1లక్ష నుంచి రెండున్నర లక్షల ఎకరాలకు పదేళ్లతో నీళ్లందించుకున్నామన్నారు.
తెలంగాణ వచ్చాకా ఏమొచ్చిందంటే కోటీ ఎకరాల మాగాణగా మార్చామని గర్వంగా చెప్పుకోవచ్చన్నారు. కాంగ్రెస్ నాయకులు పదవుల కసం పైరవీలు తప్ప ప్రాజెక్టు కోసం కొట్లాడిన చరిత్ర లేదన్నారు. జై తెలంగాణ అంటే ప్రాజెక్టులకు శంకుస్థానలతో కాలం వెళ్లబుచ్చారన్నారు. వైఎస్సార్ జల దోపిడిని జగన్, చంద్రబాబులు కొనసాగించారని కవిత విమర్శించారు. ఇందుకు తాజాగా రాయలసీమ ఎత్తిపోతల, బనకచర్ల ప్రాజెక్టు నిదర్శనమన్నారు. తెలంగా జలవనరుల తరలింపులో టీడీపీకి బీజేపీ కూడా తోడయ్యిందని..నాగార్జున సాగర్ ప్రాజెక్టును తెలంగాణ పరిధిలోకి ఇవ్వకుండా కేద్ర బలగాల పరిధిలోకి తీసుకెళ్లిందని కవిత తప్పుబట్టారు. కాంగ్రెస్ నాయకులు న్యాయస్థానాల్లో, ట్రిబ్యూనళ్లలో చనిపోయివ వారి పేరిట కూడా కేసులు వేసి ప్రాజెక్టులు అడ్డుకున్నారన్నారు.
ఎంపీగా పార్లమెంటులో తాను తెలంగాణ నీటీ సమస్యలపై మాట్లడితే ఇతర రాష్ట్రాల వారు అంతా కలిసి అడ్డగించేవారన్నారు. తెలంగాణ నాయకుల్లో ఆ పరిస్థితి లేదన్నారు. చంద్రబాబు, జగన్ లు రాజకీయంగా కొట్టుకున్నప్పటికి ఒకరు చేపట్టిన ప్రాజెక్టులను మరొకరు కొనసాగించారన్నారు. తెలంగాణలో మాత్రం కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులను రాజకీయ కోపంతో పడావు పెట్టేందుకు కాంగ్రెస్ తెలంగాణ పాలకులు ప్రయత్నం చేయడం విచారకరమన్నారు. తమ రాజకీయాల కోసం రైతుల పొలాలను పడావు పెట్టడం సరికాదన్నారు. రాజకీయాలు నీళ్లతో చేయకుండా నిజాలు చెప్పి ప్రజల పక్షాన పనిచేయాలని కవిత డిమాండ్ చేశారు. కాంగ్రెస్ బురద రాజకీయాలను, గోదావరి వరదలను తట్టుకుని మేడిగడ్డ 12లక్షల క్యుసెక్కుల వరదను తట్టుకుని మేరునగర ధీరుడిగా నిలబడిందన్నారు. అటువంటి ప్రాజెక్టులు తెలంగాణ ప్రజల ఆస్తిగా పాలకులు గ్రహించాలన్నారు.
కేసీఆర్ చేపట్టిన ప్రాజెక్టులలో అసంపూర్తి పనులు పూర్తి చేసి మరో 35లక్షలకు నీరందించేందుకు ప్రభుత్వం పనిచేయాలన్నారు. చిల్లర రాజకీయాలు కాకుండా రాజనీతిజ్ఞతతో వ్యవహరించాలని కవిత కోరారు. వైఎస్సార్ ఆరోగ్యశ్రీని కేసీఆర్, కాంగ్రెస్ ఉపాధి హామీని బీజేపీ కొనసాగిస్తుందని, అదే బాటలో రాజకీయాలకు అతీతంగా కేసీఆర్ ప్రారంభించిన ప్రాజెక్టులను, పథకాలను సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కొనసాగించాలన్నారు. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఇప్పుడు మిస్ గైడెడ్ మిస్సైల్(A Miss Guided Missile) గా పనిచేస్తున్నారని ఎందుకంటే ఆయన కేసీఆర్ ను శత్రువుగా, రైతులను శత్రువుగా భావిస్తున్నారని..కాని తెలంగాణ నది జలాలను ఎత్తుకెళ్లే ఆంధ్ర పాలకులు శత్రువులన్న సంగతి గ్రహించాలని కవిత పేర్కొన్నారు. తెలంగాణ నది జలాలకు నష్టం చేసేలా ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఆధిత్యనాద్ దాస్ తెలంగాజ జల వనరుల సలహాదారుడిగా నియమించారని..వెంటనే ఆయనను తప్పించి తెలంగాణ నీటి ప్రయోజనాలు కాపాడేలా తెలంగాణ సోయితో పనిచేసి ట్రిబ్యూనళ్లలో వాదనలు వినిపించాలని కవిత డిమాండ్ చేశారు.






