పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ నిరసన - తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్

by Ramesh Naini |

తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న 1,600 మంది అమరవీరులను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అవమానించారని.. వెంటనే రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్ చేశారు.

పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద కాంగ్రెస్ నిరసన - తేజస్వి సూర్య క్షమాపణ చెప్పాలని డిమాండ్
X

దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణలో ఆత్మ బలిదానాలు చేసుకున్న 1,600 మంది అమరవీరులను బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య అవమానించారని.. వెంటనే రాష్ట్ర ప్రజలకు ఆయన బహిరంగ క్షమాపణలు చెప్పాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి డిమాండ్ చేశారు. బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వ్యాఖ్యలపై పార్లమెంట్ మకర్ ద్వార్ వద్ద తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా చామల మాట్లాడుతూ.. తేజస్వి సూర్యకు తెలంగాణపై ఏం అవగాహన ఉన్నదని మాట్లాడారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలను రికార్డుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. తేజస్వి వ్యాఖ్యలను కిషన్‌రెడ్డి సమర్థిస్తూ లోక్‌సభలో మాట్లాడారని.. ఆయన తీరును తెలంగాణ ప్రజలు గమనించాలని కోరారు. బీఆర్ఎస్ అవయవదానం చేసి బీజేపీకి 8 లోక్‌సభ సీట్లు ఇచ్చిందని.. బీజేపీని గెలిపించి బీఆర్ఎస్ బుద్ధి తక్కువ పని చేసిందన్నారు.

Next Story